Vala pogasoda numda vatti baya leemdanela

వల పొకచోట నుండ వట్టి బయ లీఁదనేల
Language

(॥పల్లవి॥)
వల పొకచోట నుండ వట్టి బయ లీఁదనేల
బలిమిని మాతో నేల పదరేవు నీవూ

(॥॥)
కలికి నీ దేవులు గడియ వెట్టు మంటేను
చెలిమి కత్తెల నేల చేయి వట్టేవు
అలుక దేరిచి యాపె నటు వేఁడుకొంట గాక
పిలిచి మాతో నేల పెనఁగేవు నీవూ

(॥॥)
యేకతాన నుండ నాకె యింటిలోని కేఁగితేను
వాకిటి దాని కొప్పేల వంచేవు
ఆకె కే ప్రియాలు చెప్పి అంపి రప్పించుకో రాదా
దాకొని మమ్మేటికిఁ దడవేవు నీవు

(॥॥)
కూడ నీవు రాఁ గా నాపె తోడు చెలుల రమ్మంటే
నూడిగపు వారి నేల వొడివట్టే వు
యీడ నలమేల్మంగను యేలి శ్రీ వేంకటేశ్వర
జోడైతిరి మమ్మేమి చూచేవు నీవూ

(||pallavi||)
vala pŏgasoḍa nuṁḍa vaṭṭi baya līm̐danela
balimini mādo nela padarevu nīvū

(||||)
kaligi nī devulu gaḍiya vĕṭṭu maṁṭenu
sĕlimi kattĕla nela seyi vaṭṭevu
aluga derisi yābĕ naḍu vem̐ḍugŏṁṭa gāga
pilisi mādo nela pĕnam̐gevu nīvū

(||||)
yegadāna nuṁḍa nāgĕ yiṁṭiloni kem̐gidenu
vāgiḍi dāni kŏppela vaṁchevu
āgĕ ke priyālu sĕppi aṁpi rappiṁchugo rādā
dāgŏni mammeḍigim̐ daḍavevu nīvu

(||||)
kūḍa nīvu rām̐ gā nābĕ toḍu sĕlula rammaṁṭe
nūḍigabu vāri nela vŏḍivaṭṭe vu
yīḍa nalamelmaṁganu yeli śhrī veṁkaḍeśhvara
joḍaidiri mammemi sūsevu nīvū