Vaigumthabadi ninnu vadim gaanavalem gaaga

వైకుంఠపతి నిన్ను వడిఁ గానవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
వైకుంఠపతి నిన్ను వడిఁ గానవలెఁ గాక
పైకొని తద్విష్ణోఃపరమై యుండఁగను

(॥వైకుంఠపతి॥)
కాయ మేల బడలీని కడుపునించుకొఱకు
ఆయు రన్నం ప్రయచ్ఛతి యనఁగాను
ప్రాయ మేల తమకించీ పడఁతులకొఱకుఁగా
బాయట రుణానుబంధపశుపత్ని యనఁగా

(॥వైకుంఠపతి॥)
తలఁపేల చిక్కుపడీ ధనముకొఱకుఁగాను
అలమి ప్రాప్తవ్య మర్థ మనఁగాను
వెలసి యాతుమ యేల వెఱచీ దోషములకై
మలసి నిర్ధోషము సమంబ్రహ్మ మనఁగా

(॥వైకుంఠపతి॥)
ధర నిన్ని సుద్ధు లేల దరి చర్చఁ గూడువెట
నిరతి శ్రీవేంకటేశ నీవుండఁగా
శరణంటి నే నిట్టే జన్మము లెల్లఁ జింతించ
హరి నీ నామము భవహరమై యుండఁగను

(||pallavi||)
vaiguṁṭhabadi ninnu vaḍim̐ gānavalĕm̐ gāga
paigŏni tadviṣhṇoḥparamai yuṁḍam̐ganu

(||vaiguṁṭhabadi||)
kāya mela baḍalīni kaḍubuniṁchugŏṟagu
āyu rannaṁ prayachchhadi yanam̐gānu
prāya mela tamagiṁchī paḍam̐tulagŏṟagum̐gā
bāyaḍa ruṇānubaṁdhabaśhubatni yanam̐gā

(||vaiguṁṭhabadi||)
talam̐pela sikkubaḍī dhanamugŏṟagum̐gānu
alami prāptavya mardha manam̐gānu
vĕlasi yāduma yela vĕṟasī doṣhamulagai
malasi nirdhoṣhamu samaṁbrahma manam̐gā

(||vaiguṁṭhabadi||)
dhara ninni suddhu lela dari sarsam̐ gūḍuvĕḍa
niradi śhrīveṁkaḍeśha nīvuṁḍam̐gā
śharaṇaṁṭi ne niṭṭe janmamu lĕllam̐ jiṁtiṁcha
hari nī nāmamu bhavaharamai yuṁḍam̐ganu