Vadi nee javvanaanagu vasamtagaalamu vachche

వడి నీ జవ్వనానకు వసంతకాలము వచ్చె
Language

(॥పల్లవి॥)
వడి నీ జవ్వనానకు వసంతకాలము వచ్చె
అడియాస లిద్దరికి నాయములు సోఁకెనే

(॥॥)
ముదితచెమటలనే ముంగారులవె ముంచె
పెదవులఁ జిగిరించెఁ బెక్కులాగుల
పొడలుఁగుచములనే పూఁపలాయఁ బిందెలాయ
యెదుటనే పతి వున్నాఁ డిఁకనేమే చెలియా

(॥॥)
కోమలి నీ చూపులనే కొడినాగెఁ గోరికలు
వాములాయఁ బులకలే వలపు పండి
వాముదేరీ మేనిమీఁదిననవిరివాసనలు
ఆమనివిభుఁడు చేరెనలుక లింకేలే

(॥॥)
సతి నీ మోహానఁ దీగెసాగె బాహులతలు
సతమాయ నిట్టూర్పు చల్లగాలి
ఇతవై శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నుఁ గూడె
మతిలోఁ బాయకున్నాఁడు మంచిదాయఁ గదవే

(||pallavi||)
vaḍi nī javvanānagu vasaṁtagālamu vachchĕ
aḍiyāsa liddarigi nāyamulu som̐kĕne

(||||)
mudidasĕmaḍalane muṁgārulavĕ muṁchĕ
pĕdavulam̐ jigiriṁchĕm̐ bĕkkulāgula
pŏḍalum̐gusamulane pūm̐palāyam̐ biṁdĕlāya
yĕduḍane padi vunnām̐ ḍim̐kaneme sĕliyā

(||||)
komali nī sūbulane kŏḍināgĕm̐ gorigalu
vāmulāyam̐ bulagale valabu paṁḍi
vāmuderī menimīm̐dinanavirivāsanalu
āmanivibhum̐ḍu serĕnaluga liṁkele

(||||)
sadi nī mohānam̐ dīgĕsāgĕ bāhuladalu
sadamāya niṭṭūrbu sallagāli
idavai śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnum̐ gūḍĕ
madilom̐ bāyagunnām̐ḍu maṁchidāyam̐ gadave