వద్దువద్దు యెన్నఁడూను వాదులు మీకు
(॥పల్లవి॥)
వద్దువద్దు యెన్నఁడూను వాదులు మీకు
ముద్దుముద్దువలె నేఁడు మొక్కవయ్య ఆకెకు
(॥వద్దు॥)
యిక్కువలు సోఁక నేఁడు యేమాడితివో కాని
చెక్కులెల్లఁ జెమరించె చెలియకును
యెక్కువతక్కువ సేఁత లేమి సేసితివో కాని
ముక్కున నూర్పులు రేఁగె మొక్కవయ్య ఆకెకు
(॥వద్దు॥)
నాలి నాకె యేమనఁగ నాఁటఁ జూచితివో కాని
తాలిమెల్ల దిగఁబడె తరుణికిని
అలరిరతుల నెంత అలయించితివో కాని
మూలనుండి సిగ్గువడీ మొక్కవయ్య ఆకెకు
(॥వద్దు॥)
చెప్పినట్టు నీవేమి సేయవైతివో కాని
అప్పుడే కోపము రేఁగె నంగనకును
యెప్పుడో శ్రీవెంకటేశ యిటు గూడితివో కాని
ముప్పిరి నవ్వులు నవ్వీ మొక్కవయ్య ఆకెకు
(||pallavi||)
vadduvaddu yĕnnam̐ḍūnu vādulu mīgu
muddumudduvalĕ nem̐ḍu mŏkkavayya āgĕgu
(||vaddu||)
yikkuvalu som̐ka nem̐ḍu yemāḍidivo kāni
sĕkkulĕllam̐ jĕmariṁchĕ sĕliyagunu
yĕkkuvadakkuva sem̐ta lemi sesidivo kāni
mukkuna nūrbulu rem̐gĕ mŏkkavayya āgĕgu
(||vaddu||)
nāli nāgĕ yemanam̐ga nām̐ṭam̐ jūsidivo kāni
tālimĕlla digam̐baḍĕ taruṇigini
alariradula nĕṁta alayiṁchidivo kāni
mūlanuṁḍi sigguvaḍī mŏkkavayya āgĕgu
(||vaddu||)
sĕppinaṭṭu nīvemi seyavaidivo kāni
appuḍe kobamu rem̐gĕ naṁganagunu
yĕppuḍo śhrīvĕṁkaḍeśha yiḍu gūḍidivo kāni
muppiri navvulu navvī mŏkkavayya āgĕgu