Vadduvaddu tadavide vaadule summee | neevu

వద్దువద్దు తడవితే వాదులే సుమ్మీ । నీవు
Language

(॥పల్లవి॥)
వద్దువద్దు తడవితే వాదులే సుమ్మీ । నీవు
పొద్దువొద్దు వారివీరి పోడులే సుమ్మీ

(॥వద్దు॥)
పూచిననా మేననున్న పులకలకంత లివి
చేచేత నీమాటలచు చిల్లులేసుమ్మీ
చాఁచిననాచన్నులు నీజవ్వనపుయడిచే-
గాచినవురము మీఁది కాయలే సుమ్మీ

(॥వద్దు॥)
వేఁకపునాకళ లివి వెలెకురికినయట్టి-
కాఁకల నీవిరహాగ్ని కాంతులేసుమ్మీ
చేకొను నాతురుమిది చిత్తములోపలనున్న-
చీకాకులచింతలచీఁకటి సుమ్మీ

(॥వద్దు॥)
వన్నెలనామోవి యిట్టె వడిసేటితేనెలు
వున్నతి నీకు నోరూరేవూటలేసుమ్మీ
యెన్నఁగ శ్రీవేంకటేశ ఇంతలో నన్నుఁ గూడితి-
విన్నిటా నీవూ నేనూ నేకమేసుమ్మీ

(||pallavi||)
vadduvaddu taḍavide vādule summī | nīvu
pŏdduvŏddu vārivīri poḍule summī

(||vaddu||)
pūsinanā menanunna pulagalagaṁta livi
seseda nīmāḍalasu sillulesummī
sām̐sinanāsannulu nījavvanabuyaḍise-
gāsinavuramu mīm̐di kāyale summī

(||vaddu||)
vem̐kabunāgaḽa livi vĕlĕguriginayaṭṭi-
kām̐kala nīvirahāgni kāṁtulesummī
segŏnu nādurumidi sittamulobalanunna-
sīgāgulasiṁtalasīm̐kaḍi summī

(||vaddu||)
vannĕlanāmovi yiṭṭĕ vaḍiseḍidenĕlu
vunnadi nīgu norūrevūḍalesummī
yĕnnam̐ga śhrīveṁkaḍeśha iṁtalo nannum̐ gūḍidi-
vinniḍā nīvū nenū negamesummī