Vadduvaddu neegela vattivaasulu

వద్దువద్దు నీకేల వట్టివాసులు
Language

(॥పల్లవి॥)
వద్దువద్దు నీకేల వట్టివాసులు
తిద్దే నేను నీయందు తీరని కడమలు

(॥వద్దు॥)
అంగన నీతోనాడిన అప్పటిమాటలకా
చుంగులువారఁగఁ దలఁచుక నవ్వేవు
యెంగిలి సేసిన మోవి యింపుల చేఁతలకా
సింగారపుఁగళలతో శిరసువంచేవు

(॥వద్దు॥)
చెలి నీపై వినోదాన చేయి వేసినందుకా
వెలలేని వుబ్బుల నివ్వెర గందేవు
చలముతో బొమ్మలను జమకించి నందుకా
చిలుకుఁ గాఁకలు దేర చెమరించేవు

(॥వద్దు॥)
కాంత నిన్నందరిలో కాఁగిలించినందుకా
పంతపుమాట లాడుచు బయలీఁదేవు
యింతలో శ్రీ వేంకటేశ యే నిన్నుఁ గూడినందుకా
మంతనానఁ బవ్వళించి మనసు చూచేవు

(||pallavi||)
vadduvaddu nīgela vaṭṭivāsulu
tidde nenu nīyaṁdu tīrani kaḍamalu

(||vaddu||)
aṁgana nīdonāḍina appaḍimāḍalagā
suṁguluvāram̐gam̐ dalam̐suga navvevu
yĕṁgili sesina movi yiṁpula sem̐talagā
siṁgārabum̐gaḽalado śhirasuvaṁchevu

(||vaddu||)
sĕli nībai vinodāna seyi vesinaṁdugā
vĕlaleni vubbula nivvĕra gaṁdevu
salamudo bŏmmalanu jamagiṁchi naṁdugā
silugum̐ gām̐kalu dera sĕmariṁchevu

(||vaddu||)
kāṁta ninnaṁdarilo kām̐giliṁchinaṁdugā
paṁtabumāḍa lāḍusu bayalīm̐devu
yiṁtalo śhrī veṁkaḍeśha ye ninnum̐ gūḍinaṁdugā
maṁtanānam̐ bavvaḽiṁchi manasu sūsevu