Vadduvaddu mammu neevu vattijolim bettanela

వద్దువద్దు మమ్ము నీవు వట్టిజోలిఁ బెట్టనేల
Language

(॥పల్లవి॥)
వద్దువద్దు మమ్ము నీవు వట్టిజోలిఁ బెట్టనేల
సుద్దులనే తనిసి నేఁ జొక్కివున్నదానరా

(॥వద్దు॥)
మాఁటలు నెఱఁగవచ్చు మరి కొండ మోవవచ్చు
మేఁటిదొరవు నిన్నైతే మెప్పించరాదు
దూఁటు కెఁదైనాఁ దూరి తోఁచినందే వుండవచ్చు
ఆఁటదాన నిన్ను నౌఁగాదనలేనురా

(॥వద్దు॥)
ఆక మందుకోవచ్చు అరుల సాదించవచ్చు
నాకు నీతో నింతేసి నవ్వరాదురా
వాకుగా జలధి గట్టవచ్చు మాయచూపవచ్చు
పైకొని నిన్నొక యింత పలికించరాదురా

(॥వద్దు॥)
ఱట్టయి తిరుగవచ్చు ఱాతరూపు గావచ్చు
యిట్టె నీరతులమేలు యెంచరాదురా
నెట్టిన శ్రీవేంకటేశ నీకు వలవఁగవచ్చు
పట్టినచలాన నిన్నుఁబాయరాదురా

(||pallavi||)
vadduvaddu mammu nīvu vaṭṭijolim̐ bĕṭṭanela
suddulane tanisi nem̐ jŏkkivunnadānarā

(||vaddu||)
mām̐ṭalu nĕṟam̐gavachchu mari kŏṁḍa movavachchu
mem̐ṭidŏravu ninnaide mĕppiṁcharādu
dūm̐ṭu kĕm̐dainām̐ dūri tom̐sinaṁde vuṁḍavachchu
ām̐ṭadāna ninnu naum̐gādanalenurā

(||vaddu||)
āga maṁdugovachchu arula sādiṁchavachchu
nāgu nīdo niṁtesi navvarādurā
vāgugā jaladhi gaṭṭavachchu māyasūbavachchu
paigŏni ninnŏga yiṁta paligiṁcharādurā

(||vaddu||)
ṟaṭṭayi tirugavachchu ṟādarūbu gāvachchu
yiṭṭĕ nīradulamelu yĕṁcharādurā
nĕṭṭina śhrīveṁkaḍeśha nīgu valavam̐gavachchu
paṭṭinasalāna ninnum̐bāyarādurā