Vadduvaddu dosamu valasivachchinavaarim

వద్దువద్దు దోసము వలచివచ్చినవారిఁ
Language

(॥పల్లవి॥)
వద్దువద్దు దోసము వలచివచ్చినవారిఁ
దిద్దుకొని కోరికలు దీరుచకుండితేను

(॥॥)
పలచఁగా నవ్వి యాపె భావించి చూచీ నిన్ను
నెలకొన్న వావులను నీకేమౌనో
తలవంచుకోకు నీవు దండనున్న దాన నేను
అలరి యెంతకైనాను ఆడుకొనే నేను

(॥॥)
పట్టి పెనఁగుచు నీకుఁ బైపై విందు చెప్పీని
నెట్టనఁ జుట్టరికము నీకెంత గద్దో
దట్టించి తప్పించుకోకు దాపు నీకు నేనుందాన
అట్టే యేపనికైనా నానుకొనే నేను

(॥॥)
చనవుతోఁ గాఁగిలించి సారెసారె మాటలాడీ
నెనరైన నేస్తము నీకది యెట్టో
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నీడ లోఁగ-
కనువైన వూడిగాల కడ్డమయ్యే నేను

(||pallavi||)
vadduvaddu dosamu valasivachchinavārim̐
diddugŏni korigalu dīrusaguṁḍidenu

(||||)
palasam̐gā navvi yābĕ bhāviṁchi sūsī ninnu
nĕlagŏnna vāvulanu nīgemauno
talavaṁchugogu nīvu daṁḍanunna dāna nenu
alari yĕṁtagainānu āḍugŏne nenu

(||||)
paṭṭi pĕnam̐gusu nīgum̐ baibai viṁdu sĕppīni
nĕṭṭanam̐ juṭṭarigamu nīgĕṁta gaddo
daṭṭiṁchi tappiṁchugogu dābu nīgu nenuṁdāna
aṭṭe yebanigainā nānugŏne nenu

(||||)
sanavudom̐ gām̐giliṁchi sārĕsārĕ māḍalāḍī
nĕnaraina nestamu nīgadi yĕṭṭo
yĕnasidivi śhrīveṁkaḍeśha nannu nīḍa lom̐ga-
kanuvaina vūḍigāla kaḍḍamayye nenu