Vadduvaddu dosamoo vaavigaadu neegu naagu

వద్దువద్దు దోసమూ వావిగాదు నీకు నాకు
Language

(॥పల్లవి॥)
వద్దువద్దు దోసమూ వావిగాదు నీకు నాకు
అద్దో తొలఁగుబావ వంటుకోకువయ్యా

(॥॥)
యేమి సేసేవోయంటా నిటు నన్నుఁ జూడనంపె
దీమసపు నీతలఁపు తెలియ నంపె
వాములై న నీలోనివలపులు రేఁచఁగ నంపె
కామించి నీవేల నన్నుఁ గాఁగిలించేవయ్యా

(॥॥)
ఇందుకే విచ్చేనేవంటా నెదురుగా నన్నంపె
కందువ నీనేరుపెల్లాఁ గనుకో నంపె
చందమామ గుటుకలు చవులచూడఁగ నంపె
యిందులోనే నీవు నాతో నేల నవ్వేవయ్యా

(॥॥)
చేరువకు వచ్చి నిన్నుఁ జెలి యచ్చరించ నంపె
బీరాన నాచేత నిన్నుఁ బిలువ నంపె
యీరీతి శ్రీ వేంకటేశ యీడ నన్నుఁ గూడి యాకెఁ
గూరిమిఁ గూడితి విట్టె కొత్త యేఁటిదయ్యా

(||pallavi||)
vadduvaddu dosamū vāvigādu nīgu nāgu
addo tŏlam̐gubāva vaṁṭugoguvayyā

(||||)
yemi sesevoyaṁṭā niḍu nannum̐ jūḍanaṁpĕ
dīmasabu nīdalam̐pu tĕliya naṁpĕ
vāmulai na nīlonivalabulu rem̐sam̐ga naṁpĕ
kāmiṁchi nīvela nannum̐ gām̐giliṁchevayyā

(||||)
iṁduge vichchenevaṁṭā nĕdurugā nannaṁpĕ
kaṁduva nīnerubĕllām̐ ganugo naṁpĕ
saṁdamāma guḍugalu savulasūḍam̐ga naṁpĕ
yiṁdulone nīvu nādo nela navvevayyā

(||||)
seruvagu vachchi ninnum̐ jĕli yachchariṁcha naṁpĕ
bīrāna nāseda ninnum̐ biluva naṁpĕ
yīrīdi śhrī veṁkaḍeśha yīḍa nannum̐ gūḍi yāgĕm̐
gūrimim̐ gūḍidi viṭṭĕ kŏtta yem̐ṭidayyā