Vaddu veṟavagu todu vachchemgaani neegu

వద్దు వెఱవకు తోడు వచ్చేఁగాని నీకు
Language

(॥పల్లవి॥)
వద్దు వెఱవకు తోడు వచ్చేఁగాని నీకు
యిద్దరిలో నాకుఁగా నీవింత సేసేవా

(॥వద్దు॥)
కొనగోరు దాఁకించితే కోపగించుకొనేవు
చనవు సేసుక నిన్ను జరసితిని
వెనక నొక్కెతె నిన్ను వెంగె మాడీనంటాను
తనువు రేకలకే తల్లడించేవు

(॥వద్దు॥)
గందము నేఁ బూసితేను కడు నలఁచివేసేవు
పొందులు సేసుక నిన్నుఁ బొదిగితిని
నిందవేసి యవ్వతైనా నిన్నుఁ దిట్టీనంటాను
విందుల సింగారాలకే వెరచి లోఁగేవు

(॥వద్దు॥)
తగిలి నేఁ గూడితేను తమకించితి విప్పుడు
మొగచాటుకాకుండా మోవి ఇచ్చితి
నగితి శ్రీ వేంకటేశ నమ్మితివి యింతివి
దగదొట్టి పయిపైనే తలవంచేవు

(||pallavi||)
vaddu vĕṟavagu toḍu vachchem̐gāni nīgu
yiddarilo nāgum̐gā nīviṁta sesevā

(||vaddu||)
kŏnagoru dām̐kiṁchide kobagiṁchugŏnevu
sanavu sesuga ninnu jarasidini
vĕnaga nŏkkĕdĕ ninnu vĕṁgĕ māḍīnaṁṭānu
tanuvu regalage tallaḍiṁchevu

(||vaddu||)
gaṁdamu nem̐ būsidenu kaḍu nalam̐sivesevu
pŏṁdulu sesuga ninnum̐ bŏdigidini
niṁdavesi yavvadainā ninnum̐ diṭṭīnaṁṭānu
viṁdula siṁgārālage vĕrasi lom̐gevu

(||vaddu||)
tagili nem̐ gūḍidenu tamagiṁchidi vippuḍu
mŏgasāḍugāguṁḍā movi ichchidi
nagidi śhrī veṁkaḍeśha nammidivi yiṁtivi
dagadŏṭṭi payibaine talavaṁchevu