Vaddu vemdugonavayya vanida sedilonidi

వద్దు వేఁడుకొనవయ్య వనిత చేతిలోనిది
Language

(॥పల్లవి॥)
వద్దు వేఁడుకొనవయ్య వనిత చేతిలోనిది
పెద్దరికానకే పొంచీఁ బ్రేమగల దాపె

(॥వద్దు॥)
కప్పురాన వేసె నాపె గందవొడిని వేసేవు
యెప్పుడు నందుకునిందు కెంతమాత్రము
చప్పనివలపుగాదా సరిగానిపనులకు
కుప్పళించి అందుకేపో కోపగించె నాపె

(॥వద్దు॥)
కంటసరి యిచ్చె నాపె కప్పి వుంగర మిచ్చేవు
యింటిలో నందుకునిందు కెంతమాత్రము
వొంటనితలఁపుగాదా వోపక గానియీవులు
పెంటలుగా నందకేపో పెనఁగె నేఁడాపె

(॥వద్దు॥)
చన్నుల నిన్నొత్తె నాపె సరిగా మోవి ఇచ్చితి
ఇన్నిటా మెచ్చాయ నిఁక నెంతమాత్రము
యెన్నగ శ్రీవేంకటేశ ఇట్టె నీవు గూడితివి
మన్ననల దైవారి మరిగిన దాపె

(||pallavi||)
vaddu vem̐ḍugŏnavayya vanida sedilonidi
pĕddarigānage pŏṁchīm̐ bremagala dābĕ

(||vaddu||)
kappurāna vesĕ nābĕ gaṁdavŏḍini vesevu
yĕppuḍu naṁduguniṁdu kĕṁtamātramu
sappanivalabugādā sarigānibanulagu
kuppaḽiṁchi aṁdugebo kobagiṁchĕ nābĕ

(||vaddu||)
kaṁṭasari yichchĕ nābĕ kappi vuṁgara michchevu
yiṁṭilo naṁduguniṁdu kĕṁtamātramu
vŏṁṭanidalam̐pugādā vobaga gāniyīvulu
pĕṁṭalugā naṁdagebo pĕnam̐gĕ nem̐ḍābĕ

(||vaddu||)
sannula ninnŏttĕ nābĕ sarigā movi ichchidi
inniḍā mĕchchāya nim̐ka nĕṁtamātramu
yĕnnaga śhrīveṁkaḍeśha iṭṭĕ nīvu gūḍidivi
mannanala daivāri marigina dābĕ