వద్దు వద్దు యిస్సీ నా వలపెంత నేనెంత
(॥పల్లవి॥)
వద్దు వద్దు యిస్సీ నా వలపెంత నేనెంత
వొద్దనుండి నే నిన్ను వుడికించేకొరకా
(॥వద్దు॥)
కావించి నే నేఁడు నీకుఁగలిగిన ఫలమెల్ల
వేవేగనీతోనలిగి వెతఁ బెట్టేదా
చేవదేర నీపొందు చేసినదెల్లా నేను
రావు పోవనుచు నిన్ను రాయిడించే కొరకా
(॥వద్దు॥)
వున్నతి నే జవ్వనినై వున్నదెల్లా సారె నీకు
విన్నపాలు సేయించి వేసరించేదా
మన్ననఁ బొందినదెల్లా మరి నీయిచ్చరాజవై
వున్నవాని నావద్ద వుండుమనేకొరకా
(॥వద్దు॥)
వుమ్మగిలి కాఁకల నే వుండిన ఫల మిపుడే
అమ్మరో నీకాఁగిట నేనంటించేదా
నెమ్మది శ్రీవేంకటేశ నీవె నన్నుఁ గూడితివి
యిమ్ముల నాచేఁతలెల్లానింత సేసేకొరకా
(||pallavi||)
vaddu vaddu yissī nā valabĕṁta nenĕṁta
vŏddanuṁḍi ne ninnu vuḍigiṁchegŏragā
(||vaddu||)
kāviṁchi ne nem̐ḍu nīgum̐galigina phalamĕlla
veveganīdonaligi vĕdam̐ bĕṭṭedā
sevadera nībŏṁdu sesinadĕllā nenu
rāvu povanusu ninnu rāyiḍiṁche kŏragā
(||vaddu||)
vunnadi ne javvaninai vunnadĕllā sārĕ nīgu
vinnabālu seyiṁchi vesariṁchedā
mannanam̐ bŏṁdinadĕllā mari nīyichcharājavai
vunnavāni nāvadda vuṁḍumanegŏragā
(||vaddu||)
vummagili kām̐kala ne vuṁḍina phala mibuḍe
ammaro nīgām̐giḍa nenaṁṭiṁchedā
nĕmmadi śhrīveṁkaḍeśha nīvĕ nannum̐ gūḍidivi
yimmula nāsem̐talĕllāniṁta sesegŏragā