వద్దు వద్దు యిఁక నేల వట్టిమాయల నీ
(॥పల్లవి॥)
వద్దు వద్దు యిఁక నేల వట్టిమాయల నీ-
సుద్దులు నేమెఱఁగమా చొక్కులఁ బెట్టేవూ
(॥వద్దు॥)
అంగన వచ్చినరాక లడిగేవు నీవు తొల్లె
యింగితాకారములు నీ వెఱఁగిని వా
ముంగిట మావంటి వీరిముందరను గోలవలె
వెంగలివిద్యలే సేసి వేసాలఁ బొయ్యేవూ
(॥వద్దు॥)
మగువ నీతో నవ్వితే మ మ్మేమి విచారించేవు
తెగడి యాకిలు నీవు తెలియనిదా
నిగిడి నీసతులతో నిన్నుఁగానివానివలె
జగములో నివి గొన్ని సటలు సేసేవూ
(॥వద్దు॥)
సతి నిన్ను దగ్గరితే సన్నలు మాతోఁ జేసేవు
కతలు నీయందు తొల్లి కలవే కా
మతకాన వేరె వేరె మ మ్మిద్దరిఁ గూడి మా-
రతులు శ్రీవేంకటేశ రండు మెచ్చేవూ
(||pallavi||)
vaddu vaddu yim̐ka nela vaṭṭimāyala nī-
suddulu nemĕṟam̐gamā sŏkkulam̐ bĕṭṭevū
(||vaddu||)
aṁgana vachchinarāga laḍigevu nīvu tŏllĕ
yiṁgidāgāramulu nī vĕṟam̐gini vā
muṁgiḍa māvaṁṭi vīrimuṁdaranu golavalĕ
vĕṁgalividyale sesi vesālam̐ bŏyyevū
(||vaddu||)
maguva nīdo navvide ma mmemi visāriṁchevu
tĕgaḍi yāgilu nīvu tĕliyanidā
nigiḍi nīsadulado ninnum̐gānivānivalĕ
jagamulo nivi gŏnni saḍalu sesevū
(||vaddu||)
sadi ninnu daggaride sannalu mādom̐ jesevu
kadalu nīyaṁdu tŏlli kalave kā
madagāna verĕ verĕ ma mmiddarim̐ gūḍi mā-
radulu śhrīveṁkaḍeśha raṁḍu mĕchchevū