వద్దు వద్దు వేగిరాలు వనితతోను
(॥పల్లవి॥)
వద్దు వద్దు వేగిరాలు వనితతోను
పొద్దువొద్దు నీనిజము పొదిగొంటే జాలును
(॥వద్దు॥)
కలువరేకులవంటికన్నులకలికి నీమై
సొలసి సొలసి చూచి సోదించీని
వీకొలదిమీఱగ నీకుగోపమేల తాపమేల
మొలచి నీవొళ్ల కల్ల మోవకున్న జాలును
(॥వద్దు॥)
నాలికప్పురమువంటినవ్వులచెలియ నేఁడు
లోలత నీమనసు దెలుసుకొనీని
వోలి నీకు నింతలోనె వొట్లేల సత్యాలేల
తాలిమితో నీతగవు తప్పకున్నఁ జాలును
(॥వద్దు॥)
తీగెలవంటిచేతుల తెఱవ కాఁగిట నించి
ఆగతి నిన్ను రతుల నలయించీని
వేగిర మేఁటికి శ్రీవేంకటేశ యిటువలె
బాగుగాఁ బెనఁగి మీరు పాయకున్నఁజాలును
(||pallavi||)
vaddu vaddu vegirālu vanidadonu
pŏdduvŏddu nīnijamu pŏdigŏṁṭe jālunu
(||vaddu||)
kaluvaregulavaṁṭigannulagaligi nīmai
sŏlasi sŏlasi sūsi sodiṁchīni
vīgŏladimīṟaga nīgugobamela tābamela
mŏlasi nīvŏḽla kalla movagunna jālunu
(||vaddu||)
nāligappuramuvaṁṭinavvulasĕliya nem̐ḍu
lolada nīmanasu dĕlusugŏnīni
voli nīgu niṁtalonĕ vŏṭlela satyālela
tālimido nīdagavu tappagunnam̐ jālunu
(||vaddu||)
tīgĕlavaṁṭisedula tĕṟava kām̐giḍa niṁchi
āgadi ninnu radula nalayiṁchīni
vegira mem̐ṭigi śhrīveṁkaḍeśha yiḍuvalĕ
bāgugām̐ bĕnam̐gi mīru pāyagunnam̐jālunu