వద్దు వద్దు వలపులు వాఁటములు సేయక
(॥పల్లవి॥)
వద్దు వద్దు వలపులు వాఁటములు సేయక
తిద్దుకో మా గుణము దినదిన బెంబడి
(॥వద్దు॥)
పంతములాడి నీతో పచారించి సొలయఁగా
వింతవారమూ నేము వేమారును
చెంతల నీవూడిగముసేసి బల్లిదులమింతే
వంతులేల పట్టేవువారివీరితోడను
(॥వద్దు॥)
కరకరిఁబెట్టి నీతో గామిడితనాలు చూప
పొరుగువారమా నేము పొద్దువొద్దును
అరుదుగా నీకు నిచ్చలడి బల్లిదుల మింతే
తొరలించనేమిటికి దొమ్మివారితోడను
(॥వద్దు॥)
నెయ్యములు చూపి నీతో నేరుపులు వచరించ
వియ్యపువారమా నేము వచిచనవిడి
కొయ్య శ్రీవేంకటేశ్వరకూడి బల్లిదుల మింతే
ఇయ్యకొల్ప నింతేఁటికి ఇంటివారితోడను
(||pallavi||)
vaddu vaddu valabulu vām̐ṭamulu seyaga
tiddugo mā guṇamu dinadina bĕṁbaḍi
(||vaddu||)
paṁtamulāḍi nīdo pasāriṁchi sŏlayam̐gā
viṁtavāramū nemu vemārunu
sĕṁtala nīvūḍigamusesi ballidulamiṁte
vaṁtulela paṭṭevuvārivīridoḍanu
(||vaddu||)
karagarim̐bĕṭṭi nīdo gāmiḍidanālu sūba
pŏruguvāramā nemu pŏdduvŏddunu
arudugā nīgu nichchalaḍi ballidula miṁte
tŏraliṁchanemiḍigi dŏmmivāridoḍanu
(||vaddu||)
nĕyyamulu sūbi nīdo nerubulu vasariṁcha
viyyabuvāramā nemu vasisanaviḍi
kŏyya śhrīveṁkaḍeśhvaragūḍi ballidula miṁte
iyyagŏlba niṁtem̐ṭigi iṁṭivāridoḍanu