Vaddu vaddu neevamta vaadu vettugogu mimka

వద్దు వద్దు నీవంత వాదు వెట్టుకోకు మిఁక
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు నీవంత వాదు వెట్టుకోకు మిఁక
తిద్ది రతులనే నిన్నుఁ దెమలించదా

(॥వద్దు॥)
పనివడి యాపె నీతో పంతమాడ నేఁటికి
చనుమొనలే చూపి సాదించదా
మనసెఱఁగవు గాక మానిని నీ యెడకు
కనుఁగొనలనే చూచి కరఁగించదా

(॥వద్దు॥)
కెలపుతిట్ల నిన్ను కిందుపరచనేఁటికి
సెలవినే నవ్వి యాపె చిమ్మిరేఁచదా
బలిమెఱఁగవు గాక పడఁతి నిన్ను నేఁచితే
పలచనిచేఁతలనే భ్రమయించదా

(॥వద్దు॥)
కైవశము సేయ నీతో కతలెల్లా నేఁటికి
మోవి తేనెలే చూపి మోహించపించదా
యీవేళ శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి
వేవేలు సరసములు వెలయించదా

(||pallavi||)
vaddu vaddu nīvaṁta vādu vĕṭṭugogu mim̐ka
tiddi radulane ninnum̐ dĕmaliṁchadā

(||vaddu||)
panivaḍi yābĕ nīdo paṁtamāḍa nem̐ṭigi
sanumŏnale sūbi sādiṁchadā
manasĕṟam̐gavu gāga mānini nī yĕḍagu
kanum̐gŏnalane sūsi karam̐giṁchadā

(||vaddu||)
kĕlabudiṭla ninnu kiṁdubarasanem̐ṭigi
sĕlavine navvi yābĕ simmirem̐sadā
balimĕṟam̐gavu gāga paḍam̐ti ninnu nem̐side
palasanisem̐talane bhramayiṁchadā

(||vaddu||)
kaivaśhamu seya nīdo kadalĕllā nem̐ṭigi
movi tenĕle sūbi mohiṁchabiṁchadā
yīveḽa śhrī veṁkaḍeśha yiṁti nīvu gūḍidivi
vevelu sarasamulu vĕlayiṁchadā