Vaddu vaddu neegimta vattibimkamu

వద్దు వద్దు నీకింత వట్టిబింకము
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు నీకింత వట్టిబింకము
యిద్దరి సందడి వలపు లెరఁగమా నేము

(॥వద్దు॥)
యింతి నీవద్దికి రాఁగా నెక్కడ పరాకైతివి
దొంతి గొన్న దిది యేఁటిదొరతనము
అంత గుండెగల వాఁడ వాపె నిన్నుఁ బాసి వుంటే
యెంతైనా నా పెవద్ది కేఁగక మానేవా

(॥వద్దు॥)
నిక్కి నిన్నుఁ జూడఁగాను నెలఁతతో నవ్వవద్దా
యెక్కువ నీయెడ్డతన మది యేఁటిది
తక్కరీఁడ వింతైతే తమకించితే నాపెకు
గక్కన జేతికి లోనుగాక మానేవా

(॥వద్దు॥)
నెట్టన గాఁగిలించఁగా నీవు గుట్టుతో నుందురా
యిట్టి వెఱ్ఱితనమైతే నేమందురు
ఱట్టై శ్రీ వేంకటేశ మెఱయ నింతిఁ గూడితివి
జట్టి గొనఁగా రతులు చాలా ననఁగలవా

(||pallavi||)
vaddu vaddu nīgiṁta vaṭṭibiṁkamu
yiddari saṁdaḍi valabu lĕram̐gamā nemu

(||vaddu||)
yiṁti nīvaddigi rām̐gā nĕkkaḍa parāgaidivi
dŏṁti gŏnna didi yem̐ṭidŏradanamu
aṁta guṁḍĕgala vām̐ḍa vābĕ ninnum̐ bāsi vuṁṭe
yĕṁtainā nā pĕvaddi kem̐gaga mānevā

(||vaddu||)
nikki ninnum̐ jūḍam̐gānu nĕlam̐tado navvavaddā
yĕkkuva nīyĕḍḍadana madi yem̐ṭidi
takkarīm̐ḍa viṁtaide tamagiṁchide nābĕgu
gakkana jedigi lonugāga mānevā

(||vaddu||)
nĕṭṭana gām̐giliṁcham̐gā nīvu guṭṭudo nuṁdurā
yiṭṭi vĕṭridanamaide nemaṁduru
ṟaṭṭai śhrī veṁkaḍeśha mĕṟaya niṁtim̐ gūḍidivi
jaṭṭi gŏnam̐gā radulu sālā nanam̐galavā