వద్దు వద్దు నీ వంతేసి వైతాళాలు నీ
(॥పల్లవి॥)
వద్దు వద్దు నీ వంతేసి వైతాళాలు నీ-
సుద్దులెల్లా నెఱుఁగుదు సోద్యపడనేఁటికి
(॥వద్దు॥)
చెక్కులేల గిల్లేవు చేరి వేఁడుకొనేనంటా
వక్కణించి నీవు మంచివాని వలెనే
కక్కసమేల పెట్టేవు కాఁగిలించుకొనేనంటా
వెక్కసమై నిన్నుఁ గడు వెగ్గళించే దాననా
(॥వద్దు॥)
ముందలేల పట్టేవు ముడిచేనంటాఁ బూవులు
చెంది నాకు నితవరి చేఁతవలెనే
సందడిఁ బెనఁగనేల సరసములాడేయట్టు
కందువ నీతో నేను కపటాలదాననా
(॥వద్దు॥)
ఆయములే లంటేవు అంగవించికూడేనంటా
చాయల నాకు దక్కిన సాదువలెనే
యీయెడ శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
వోయయ్య నిన్ను మెచ్చక వొరసేటి దాననా
(||pallavi||)
vaddu vaddu nī vaṁtesi vaidāḽālu nī-
suddulĕllā nĕṟum̐gudu sodyabaḍanem̐ṭigi
(||vaddu||)
sĕkkulela gillevu seri vem̐ḍugŏnenaṁṭā
vakkaṇiṁchi nīvu maṁchivāni valĕne
kakkasamela pĕṭṭevu kām̐giliṁchugŏnenaṁṭā
vĕkkasamai ninnum̐ gaḍu vĕggaḽiṁche dānanā
(||vaddu||)
muṁdalela paṭṭevu muḍisenaṁṭām̐ būvulu
sĕṁdi nāgu nidavari sem̐tavalĕne
saṁdaḍim̐ bĕnam̐ganela sarasamulāḍeyaṭṭu
kaṁduva nīdo nenu kabaḍāladānanā
(||vaddu||)
āyamule laṁṭevu aṁgaviṁchigūḍenaṁṭā
sāyala nāgu dakkina sāduvalĕne
yīyĕḍa śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
voyayya ninnu mĕchchaga vŏraseḍi dānanā