Vaddu vaddu nee kimtesi vatti solabu

వద్దు వద్దు నీ కింతేసి వట్టి సొలపు
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు నీ కింతేసి వట్టి సొలపు
సుద్దులు చెప్పఁగబోతే సూటిఁబడ దిఁకను

(॥వద్దు॥)
నగితిఁ జాలదా నీతో నాలోఁ గోపించుకొనక
మగుడి గమ్మటి నీవే మమ్ము దూరేవు
మొగమోడితిఁ జాలదా మొక్కలీఁడ నియ్యడకు
వొగరులాడ వచ్చేవు వోపము నే మిందుకు

(॥వద్దు॥)
మాటాడితిఁ జాలదా నే మారుమోము సేసుకోక
నీటున నప్పటి నీవే నేర మెంచేవు
చాటువఁ బేరుకొంటిని చాలదా నిన్నిందరిలో
తేటతెల్లమాయఁ బని తెలిసితి మిపుడే

(॥వద్దు॥)
వూరకుంటిఁ జాలదా వొంటి నన్నుఁ జెనకఁగ
కేరడాల నీవు నన్నుఁ గెరలించేవు
ఆరితేరి శ్రీవేంకటాధిప కూడితి విట్టె
చేరె నీపంతములెల్లాఁ జింతలేల యిఁకను

(||pallavi||)
vaddu vaddu nī kiṁtesi vaṭṭi sŏlabu
suddulu sĕppam̐gabode sūḍim̐baḍa dim̐kanu

(||vaddu||)
nagidim̐ jāladā nīdo nālom̐ gobiṁchugŏnaga
maguḍi gammaḍi nīve mammu dūrevu
mŏgamoḍidim̐ jāladā mŏkkalīm̐ḍa niyyaḍagu
vŏgarulāḍa vachchevu vobamu ne miṁdugu

(||vaddu||)
māḍāḍidim̐ jāladā ne mārumomu sesugoga
nīḍuna nappaḍi nīve nera mĕṁchevu
sāḍuvam̐ berugŏṁṭini sāladā ninniṁdarilo
teḍadĕllamāyam̐ bani tĕlisidi mibuḍe

(||vaddu||)
vūraguṁṭim̐ jāladā vŏṁṭi nannum̐ jĕnagam̐ga
keraḍāla nīvu nannum̐ gĕraliṁchevu
ārideri śhrīveṁkaḍādhiba kūḍidi viṭṭĕ
serĕ nībaṁtamulĕllām̐ jiṁtalela yim̐kanu