Vaddu vaddu nee kimtesi valaseenollamulu

వద్దు వద్దు నీ కింతేసి వలసీనొల్లములు
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు నీ కింతేసి వలసీనొల్లములు
గద్దించి నిన్నుఁ గలసే కాఁగిటిలోదానను

(॥వద్దు॥)
వెట్టికే మాటలాడకు వేగినంతా నాతోను
యెట్టకేలకు వచ్చితి వీడకు నీవు
జట్టిగొని చక్కఁజూడు సరసములాడు నీతో
కట్టఁగడదానఁ గాను కలదాన నీకు

(॥వద్దు॥)
తేరనవ్వులు నవ్వకు తిరిగి తిరిగి నీవు
ఆరితేరి చేతికి లోనైతి విపుడు
ఆరగించుమా కప్పురము అందుకో తమకమున
పోరచివారము గాము పోరానివారము

(॥వద్దు॥)
నివ్వెరగులు విడువు నెమ్మది శ్రీవేంకటేశ
యివ్వలఁ గూడితివి నన్నిచ్చకముతో
పవ్వళించు మా వద్దఁ బాయ కిట్టె సుఖియించు
దవ్వులవనితనా దండనుండేయింతిని

(||pallavi||)
vaddu vaddu nī kiṁtesi valasīnŏllamulu
gaddiṁchi ninnum̐ galase kām̐giḍilodānanu

(||vaddu||)
vĕṭṭige māḍalāḍagu veginaṁtā nādonu
yĕṭṭagelagu vachchidi vīḍagu nīvu
jaṭṭigŏni sakkam̐jūḍu sarasamulāḍu nīdo
kaṭṭam̐gaḍadānam̐ gānu kaladāna nīgu

(||vaddu||)
teranavvulu navvagu tirigi tirigi nīvu
ārideri sedigi lonaidi vibuḍu
āragiṁchumā kappuramu aṁdugo tamagamuna
porasivāramu gāmu porānivāramu

(||vaddu||)
nivvĕragulu viḍuvu nĕmmadi śhrīveṁkaḍeśha
yivvalam̐ gūḍidivi nannichchagamudo
pavvaḽiṁchu mā vaddam̐ bāya kiṭṭĕ sukhiyiṁchu
davvulavanidanā daṁḍanuṁḍeyiṁtini