Vaddu vaddu nee kela vattibhayamu

వద్దు వద్దు నీ కేల వట్టిభయము
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు నీ కేల వట్టిభయము
యిద్దరము మనలోన నేక మౌత గాక

(॥వద్దు॥)
యెడమాట లిఁక నేల యెదిరించిన వెనక
కడు రేఁగ నిఁక నేల కన్న వెనక
వెడమాయ లిఁక నేల వెల్లివిరైన వెనక
వొడలిలో నిముడుక వూరకుండుట గాక

(॥వద్దు॥)
తలపోఁత లిఁక నేల దగ్గరి వచ్చిన మీఁద
సొలపు లేల మోము చూచిన మీఁద
చలపట్టి నిఁక నేల చవిసేసికొన్నమీఁద
లఁక దేరుచుకొని కైకొనుట గాక

(॥వద్దు॥)
నివ్వెఱఁగు లిఁక నేల నీవే నేనైనమీఁద
నవ్వు లేల నీ వలపు నమ్మినమీఁద
యివ్వల శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
పువ్వులపులకలతో పొద్దు వోత గాకా

(||pallavi||)
vaddu vaddu nī kela vaṭṭibhayamu
yiddaramu manalona nega mauda gāga

(||vaddu||)
yĕḍamāḍa lim̐ka nela yĕdiriṁchina vĕnaga
kaḍu rem̐ga nim̐ka nela kanna vĕnaga
vĕḍamāya lim̐ka nela vĕlliviraina vĕnaga
vŏḍalilo nimuḍuga vūraguṁḍuḍa gāga

(||vaddu||)
talabom̐ta lim̐ka nela daggari vachchina mīm̐da
sŏlabu lela momu sūsina mīm̐da
salabaṭṭi nim̐ka nela savisesigŏnnamīm̐da
lam̐ka derusugŏni kaigŏnuḍa gāga

(||vaddu||)
nivvĕṟam̐gu lim̐ka nela nīve nenainamīm̐da
navvu lela nī valabu namminamīm̐da
yivvala śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
puvvulabulagalado pŏddu voda gāgā