వద్దు వద్దు నవ్వ కలవాటయ్యీ నేఁడు
(॥పల్లవి॥)
వద్దు వద్దు నవ్వ కలవాటయ్యీ నేఁడు
బుద్దులు చెప్పకు నీవు పులకించీ నాకు
(॥వద్దు॥)
యెదురెత్తి మిద్దరము నేమనే విఁక నీవు
పొదుగ కానతీరాదా పోవలె మాకు
పదరి పయ్యదకొంగు పట్టకు మంతేసి నీవు
చెదరీ కురులు మేను చెమరించీ నాకు
(॥వద్దు॥)
ఆయఁ గన్నులఁ జూచితి మంతేచాలు మాకు
పోయి రమ్మనఁగరాదా పొద్దున మమ్ము
చేయివేయ కంత నీవు చి త్తమొకలా గయ్యీని
ఆయములు సోఁకి సోఁకి యాసలు రేఁచీని
(॥వద్దు॥)
మాటలాడితిమి చాలు మరి యేమిగావలె
నేఁటనే తప్పెనా మాకు విండెఁ గూరిమి
గాఁటపు శ్రీవేంకటేశ కరుణించి కూడితివి
ఆఁటదాన నింతే నేను అలయకయ్యాని
(||pallavi||)
vaddu vaddu navva kalavāḍayyī nem̐ḍu
buddulu sĕppagu nīvu pulagiṁchī nāgu
(||vaddu||)
yĕdurĕtti middaramu nemane vim̐ka nīvu
pŏduga kānadīrādā povalĕ māgu
padari payyadagŏṁgu paṭṭagu maṁtesi nīvu
sĕdarī kurulu menu sĕmariṁchī nāgu
(||vaddu||)
āyam̐ gannulam̐ jūsidi maṁtesālu māgu
poyi rammanam̐garādā pŏdduna mammu
seyiveya kaṁta nīvu si ttamŏgalā gayyīni
āyamulu som̐ki som̐ki yāsalu rem̐sīni
(||vaddu||)
māḍalāḍidimi sālu mari yemigāvalĕ
nem̐ṭane tappĕnā māgu viṁḍĕm̐ gūrimi
gām̐ṭabu śhrīveṁkaḍeśha karuṇiṁchi kūḍidivi
ām̐ṭadāna niṁte nenu alayagayyāni