వద్దు వద్దు నాతోను వట్టి యెమ్మెలు చూపను
(॥పల్లవి॥)
వద్దు వద్దు నాతోను వట్టి యెమ్మెలు చూపను
బుద్దులకు లోనై నీ పొంతనే వుందానను
(॥వద్దు॥)
ఆసలనేల పెట్టేవు ఆయములేల ముట్టేవు
సేసినట్టెల్లా నీ చేఁతకు లోను
వేసాల కొకరివలె వెరపించుకొన నేర
యీసులేక ఇదివో నీ ఇంటిలో నుందానను
(॥వద్దు॥)
యేఁటికి నవ్వు నవ్వేవు యెగసక్కే లేలాడేవు
మాఁటమాత్రమున నే నీమతిలోదాన
పాటించి యొకతెవలె పచ్చి సేయ నేనేర
చాటున నీపాదాల సరుస నుందానను
(॥వద్దు॥)
గోరనేల గీరేవు కొంగువట్టేల తీసేవు
కేరుచు నెప్పుడు నీకాఁగిటిలోదాన
చేరి నన్నుఁ గూడితివి శ్రీ వేంకటేశ్వర నేఁడు
యీరీతి నీ పచ్చడము యిక్కువ నుందానను
(||pallavi||)
vaddu vaddu nādonu vaṭṭi yĕmmĕlu sūbanu
buddulagu lonai nī pŏṁtane vuṁdānanu
(||vaddu||)
āsalanela pĕṭṭevu āyamulela muṭṭevu
sesinaṭṭĕllā nī sem̐tagu lonu
vesāla kŏgarivalĕ vĕrabiṁchugŏna nera
yīsulega idivo nī iṁṭilo nuṁdānanu
(||vaddu||)
yem̐ṭigi navvu navvevu yĕgasakke lelāḍevu
mām̐ṭamātramuna ne nīmadilodāna
pāḍiṁchi yŏgadĕvalĕ pachchi seya nenera
sāḍuna nībādāla sarusa nuṁdānanu
(||vaddu||)
goranela gīrevu kŏṁguvaṭṭela tīsevu
kerusu nĕppuḍu nīgām̐giḍilodāna
seri nannum̐ gūḍidivi śhrī veṁkaḍeśhvara nem̐ḍu
yīrīdi nī pachchaḍamu yikkuva nuṁdānanu