వద్దు వద్దు మాతోను వట్టిసట లిఁకను
(॥పల్లవి॥)
వద్దు వద్దు మాతోను వట్టిసట లిఁకను
యిద్దరుఁ గూడేటివేళ యెవ్వరున్నా రపుడు
(॥వద్దు॥)
పొంచి నిన్నాపెవేసిన పువ్వులచెండే గుఱుతు
కొంచక జారిననీకొప్పే గుఱుతు
యెంచణగ నప్పుడు సాక్షి యెవ్వరు వచ్చుండేరు
ఇంచుకంతలోనే నీవేల బొంకే విపుడు
(॥వద్దు॥)
వువిదకంకణములవొత్తు లవిగో గుఱుతు
జవళి నీపెంజెమటజాఱే గుఱుతు
పవళించి మీరుండఁగా పైకొని రానైతిఁగాని
ఇవల నిందుకుఁగాను యేలబొంకే విపుడు
(॥వద్దు॥)
చెలి నీమోవి నించిన చిలుకవోటే గుఱుతు
సెలవుల నీకుఁదోఁచేసిగ్గు గుఱుతు
బలిమి శ్రీవేంకటేశ పైకొని నన్నుఁ గూడితి-
విలపై నిండె నీసుద్దులేల బొంకేవిపుడు
(||pallavi||)
vaddu vaddu mādonu vaṭṭisaḍa lim̐kanu
yiddarum̐ gūḍeḍiveḽa yĕvvarunnā rabuḍu
(||vaddu||)
pŏṁchi ninnābĕvesina puvvulasĕṁḍe guṟudu
kŏṁchaga jārinanīgŏppe guṟudu
yĕṁchaṇaga nappuḍu sākṣhi yĕvvaru vachchuṁḍeru
iṁchugaṁtalone nīvela bŏṁke vibuḍu
(||vaddu||)
vuvidagaṁkaṇamulavŏttu lavigo guṟudu
javaḽi nībĕṁjĕmaḍajāṟe guṟudu
pavaḽiṁchi mīruṁḍam̐gā paigŏni rānaidim̐gāni
ivala niṁdugum̐gānu yelabŏṁke vibuḍu
(||vaddu||)
sĕli nīmovi niṁchina silugavoḍe guṟudu
sĕlavula nīgum̐dom̐sesiggu guṟudu
balimi śhrīveṁkaḍeśha paigŏni nannum̐ gūḍidi-
vilabai niṁḍĕ nīsuddulela bŏṁkevibuḍu