Vaddu vaddu maadonu vattimaayalu yee

వద్దు వద్దు మాతోను వట్టిమాయలు యీ
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు మాతోను వట్టిమాయలు యీ-
సుద్దులకే నవ్వేరు సుదతు లిందరును

(॥వద్దు॥)
పెలుచవై ఆపెతోడఁ బెనఁగులాడ ననేవు
మలసినమేనఁ జెమట యేడది
తలపుఁలోన విరహతాపము బొంద ననేవు
నెలకొన్ననిట్టూరపు నీకు నేడదే

(॥వద్దు॥)
తక్కినవారిపొందులు తలఁచ నని యాడేవు
చెక్కుచేతితోడ యీ చింత యాడదే
వక్కణించి యవ్వరికి వలవ నని చెప్పేవు
చిక్కని నవ్వులతోడ సిగ్గు లేడవి

(॥వద్దు॥)
రట్టుగాఁ బెరసతి నెఱుఁగ నని పలికేవు
గట్టిగా నీ మొగముకళ రేడవి
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
రెట్టియైన నీ మేని రేక లేడవి

(||pallavi||)
vaddu vaddu mādonu vaṭṭimāyalu yī-
suddulage navveru sudadu liṁdarunu

(||vaddu||)
pĕlusavai ābĕdoḍam̐ bĕnam̐gulāḍa nanevu
malasinamenam̐ jĕmaḍa yeḍadi
talabum̐lona virahadābamu bŏṁda nanevu
nĕlagŏnnaniṭṭūrabu nīgu neḍade

(||vaddu||)
takkinavāribŏṁdulu talam̐sa nani yāḍevu
sĕkkusedidoḍa yī siṁta yāḍade
vakkaṇiṁchi yavvarigi valava nani sĕppevu
sikkani navvuladoḍa siggu leḍavi

(||vaddu||)
raṭṭugām̐ bĕrasadi nĕṟum̐ga nani paligevu
gaṭṭigā nī mŏgamugaḽa reḍavi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
rĕṭṭiyaina nī meni rega leḍavi