Vaddu vaddu maadoda vaidaalaalu

వద్దు వద్దు మాతోడ వైతాళాలు
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు మాతోడ వైతాళాలు
వొద్దు నిన్నుఁ జెనకితే వొల్లననఁగలనా

(॥వద్దు॥)
అసము దించని మాఁట లాడితే నాడుదుగాని
పిసికి పిసికి వొట్టు వెట్టుకోకురా
పసురు వేసీ మవి వలచనిచిగురాకు
కసిగాటు సేసితేను కాదనఁగఁగలవా

(॥వద్దు॥)
చెల్లినదొరతనాలు సేసితేఁ జేతువుగాని
కెల్లురేఁగి నీవు కోపగించుకోకురా
ముల్లు ముంటనే తీరీ ముసలమేఁటికి నే -
నిల్లిదె కాలుదొక్కతే నెదురాడఁగలవా

(॥వద్దు॥)
గుట్టునఁ గాఁగిట నన్నుఁ గూడితేఁ గూడుదుగాని
నట్టుకొట్టి నీవంత నవ్వవద్దురా
ఇట్టె శ్రీవెంకటేశ యేలితివి రతులను
పట్టి కళదాఁకించితే భావించఁగలవా

(||pallavi||)
vaddu vaddu mādoḍa vaidāḽālu
vŏddu ninnum̐ jĕnagide vŏllananam̐galanā

(||vaddu||)
asamu diṁchani mām̐ṭa lāḍide nāḍudugāni
pisigi pisigi vŏṭṭu vĕṭṭugogurā
pasuru vesī mavi valasanisigurāgu
kasigāḍu sesidenu kādanam̐gam̐galavā

(||vaddu||)
sĕllinadŏradanālu sesidem̐ jeduvugāni
kĕllurem̐gi nīvu kobagiṁchugogurā
mullu muṁṭane tīrī musalamem̐ṭigi ne -
nillidĕ kāludŏkkade nĕdurāḍam̐galavā

(||vaddu||)
guṭṭunam̐ gām̐giḍa nannum̐ gūḍidem̐ gūḍudugāni
naṭṭugŏṭṭi nīvaṁta navvavaddurā
iṭṭĕ śhrīvĕṁkaḍeśha yelidivi radulanu
paṭṭi kaḽadām̐kiṁchide bhāviṁcham̐galavā