Vaddu vaddu maado vaadulum bodulu

వద్దు వద్దు మాతో వాదులుఁ బోదులు
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు మాతో వాదులుఁ బోదులు
పొద్దు వోయ నిఁకఁ బోరాదా

(॥వద్దు॥)
పట్టకు పట్టకు పయ్యద దొలఁగీ
అట్టె వుండి మాఁటలాడు నాతో
నిట్ట చూపు చూచి నీవేల నవ్వేవు
పొట్టఁ బొరుగునఁ బొద్దు వోదా

(॥వద్దు॥)
పిలువకు మమ్ముఁ బెను వేసటయ్యీ
నిలిచతేఁ జాలు నీ వెదుట
నిలిగి నిలిగి నీవేల దూరేవు
యెలమి నీకెప్పు డిదే పనా

(॥వద్దు॥)
నొక్కకు నాచెక్కు నునుగోరు నాఁటీ
మొక్కినంతెచాలు మున్నునీవు
యెక్కుడు శ్రీవేంకటేశ కలసితి
యిక్కువ మొఱఁగులు యిఁకనేలా

(||pallavi||)
vaddu vaddu mādo vādulum̐ bodulu
pŏddu voya nim̐kam̐ borādā

(||vaddu||)
paṭṭagu paṭṭagu payyada dŏlam̐gī
aṭṭĕ vuṁḍi mām̐ṭalāḍu nādo
niṭṭa sūbu sūsi nīvela navvevu
pŏṭṭam̐ bŏrugunam̐ bŏddu vodā

(||vaddu||)
piluvagu mammum̐ bĕnu vesaḍayyī
nilisadem̐ jālu nī vĕduḍa
niligi niligi nīvela dūrevu
yĕlami nīgĕppu ḍide panā

(||vaddu||)
nŏkkagu nāsĕkku nunugoru nām̐ṭī
mŏkkinaṁtĕsālu munnunīvu
yĕkkuḍu śhrīveṁkaḍeśha kalasidi
yikkuva mŏṟam̐gulu yim̐kanelā