Vaddu vaddu komta guttu vale nimkaanu

వద్దు వద్దు కొంత గుట్టు వలె నింకాను
Language

(॥పల్లవి॥)
వద్దు వద్దు కొంత గుట్టు వలె నింకాను
పెద్దరికేల పతిని పేరణి వెట్టకురే

(॥వద్దు॥)
తలఁపే కలిగితేను తా నిందు రాఁడా
అలరి చెలుల సారె నంప నేలా
నలుగడ నాటకము నడపీ నింతే కాక
తెలిసె తెలిసెఁ బని తెగ నాడించకురే

(॥వద్దు॥)
పలుకులే నిజమైతే పక్కన తా నాగడాల
చలివేఁడిచూపుఁ గన్నుసన్న లేలే
వలవనిజోలి దవ్వి వంతలఁబెట్టీఁ గాక
నిలు నిలు చాలుఁ జాలు నింద వేయించకురే

(॥వద్దు॥)
తారుకాణ లైతేను తగఁ గౌఁగిలించఁడా
నేరుపుల కొంతవడి నిలువ నేలా
యీ రీతి శ్రీవేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
కూరిమితోఁ దక్కఁ గొంటి కొలఁది వెట్టకురే

(||pallavi||)
vaddu vaddu kŏṁta guṭṭu valĕ niṁkānu
pĕddarigela padini peraṇi vĕṭṭagure

(||vaddu||)
talam̐pe kaligidenu tā niṁdu rām̐ḍā
alari sĕlula sārĕ naṁpa nelā
nalugaḍa nāḍagamu naḍabī niṁte kāga
tĕlisĕ tĕlisĕm̐ bani tĕga nāḍiṁchagure

(||vaddu||)
palugule nijamaide pakkana tā nāgaḍāla
salivem̐ḍisūbum̐ gannusanna lele
valavanijoli davvi vaṁtalam̐bĕṭṭīm̐ gāga
nilu nilu sālum̐ jālu niṁda veyiṁchagure

(||vaddu||)
tārugāṇa laidenu tagam̐ gaum̐giliṁcham̐ḍā
nerubula kŏṁtavaḍi niluva nelā
yī rīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
kūrimidom̐ dakkam̐ gŏṁṭi kŏlam̐di vĕṭṭagure