Vaddu summee idi neevu valasina nee ramani

వద్దు సుమ్మీ ఇది నీవు వలచిన నీ రమణి
Language

(॥పల్లవి॥)
వద్దు సుమ్మీ ఇది నీవు వలచిన నీ రమణి
వొద్దనుండఁగానే యింత వుమ్మలఁ బెట్టేవు

(॥॥)
చెక్కులెల్లాఁ జెమరించెఁ జేలియకు విభుఁడ నీ-
వక్కడనెందో పరాకై వుండఁగా
ముక్కునఁ గోపము నిండె ముండరనుండినయీపె
తక్కించి నీవు పరులఁ దప్పకచూడఁగను

(॥॥)
తనువెల్లాఁ గాఁకరేఁగె తరుణి చూడఁగ నీవు
మనసిచ్చి సతులతో మాటలాడఁగా
కనుఁగొన లెఱ్ఱనాయ కలికి నవ్వఁగ నీవు
యెనలేని తలపోఁత లెక్కడో పెంచఁగను

(॥॥)
ముచ్చికలే దైవారె మగువవిన్నపము నీ-
విచ్చగించి ఇన్నిటికి నియ్యకొనఁగా
పచ్చిగా శ్రీ వేంకటేశ పైకొని కూడితి చెలి-
నచ్చలములెల్లాఁ దీరె నంతేసి సేయఁగను

(||pallavi||)
vaddu summī idi nīvu valasina nī ramaṇi
vŏddanuṁḍam̐gāne yiṁta vummalam̐ bĕṭṭevu

(||||)
sĕkkulĕllām̐ jĕmariṁchĕm̐ jeliyagu vibhum̐ḍa nī-
vakkaḍanĕṁdo parāgai vuṁḍam̐gā
mukkunam̐ gobamu niṁḍĕ muṁḍaranuṁḍinayībĕ
takkiṁchi nīvu parulam̐ dappagasūḍam̐ganu

(||||)
tanuvĕllām̐ gām̐karem̐gĕ taruṇi sūḍam̐ga nīvu
manasichchi sadulado māḍalāḍam̐gā
kanum̐gŏna lĕṭranāya kaligi navvam̐ga nīvu
yĕnaleni talabom̐ta lĕkkaḍo pĕṁcham̐ganu

(||||)
muchchigale daivārĕ maguvavinnabamu nī-
vichchagiṁchi inniḍigi niyyagŏnam̐gā
pachchigā śhrī veṁkaḍeśha paigŏni kūḍidi sĕli-
nachchalamulĕllām̐ dīrĕ naṁtesi seyam̐ganu