Vaddu neegu vagavamga vadi nalasidi vani

వద్దు నీకు వగవఁగ వడి నలసితి వని
Language

(॥పల్లవి॥)
వద్దు నీకు వగవఁగ వడి నలసితి వని
చద్దికి వేఁడికి నీకుఁ జలి వాసెఁగా

(॥వద్దు॥)
చిత్తడి చెమటలు నీచెక్కులనే వెడ జారె
యెత్తలఁ గొండలు నీవెంద్కెకి వచ్చితో
హత్తి నీకు నవులే తొల్లి ఆవులఁ గాచిననాఁడే
చిత్తగించి అలవాటు సేసుకొంటిగా

(॥వద్దు॥)
ముక్కున నూరుపు లవే ముంచి బుసకొట్టేవు
పెక్కుమారు లెవ్వరితోఁ బెనఁగితివో
గుక్కక నీ కవులే తొల్లి గొల్లెతలతోఁ బెనఁగి
చిక్కించుక అలవాటు సేసుకొంటిగా

(॥వద్దు॥)
కాయమున నీకు నీదే కడు బడలిక దేరీ
సేయరానిపను లేమి సేసి వచ్చితో
యీయెడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితి
చేయార నీయలవాటు సేసుకొంటిగా

(||pallavi||)
vaddu nīgu vagavam̐ga vaḍi nalasidi vani
saddigi vem̐ḍigi nīgum̐ jali vāsĕm̐gā

(||vaddu||)
sittaḍi sĕmaḍalu nīsĕkkulane vĕḍa jārĕ
yĕttalam̐ gŏṁḍalu nīvĕṁdkĕgi vachchido
hatti nīgu navule tŏlli āvulam̐ gāsinanām̐ḍe
sittagiṁchi alavāḍu sesugŏṁṭigā

(||vaddu||)
mukkuna nūrubu lave muṁchi busagŏṭṭevu
pĕkkumāru lĕvvaridom̐ bĕnam̐gidivo
gukkaga nī kavule tŏlli gŏllĕdaladom̐ bĕnam̐gi
sikkiṁchuga alavāḍu sesugŏṁṭigā

(||vaddu||)
kāyamuna nīgu nīde kaḍu baḍaliga derī
seyarānibanu lemi sesi vachchido
yīyĕḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidi
seyāra nīyalavāḍu sesugŏṁṭigā