Vaddu nannum jenagagura vaademtigi

వద్దు నన్నుఁ జెనకకుర వాదేఁటికి
Language

(॥పల్లవి॥)
వద్దు నన్నుఁ జెనకకుర వాదేఁటికి
చద్దివేఁడికి సొలపు జంకెనలు మేలు

(॥వద్దు॥)
వొలసినొల్లముల పొం దొనరించుకంటేను
అలవోకలైనపొలయలక మేలు
కలసీకలయనిమనసు కసిగాటుకంటేను
తలపులో నడియాసతమకమే మేలు

(॥వద్దు॥)
పచ్చివెచ్చులకూర్మి పచరించుకంటేను
కొచ్చి వూరకయుండుగుట్టు మేలు
వచ్చియును రాములను వడిఁబొరలుకంటేను
మచ్చరము మాని మెఇ మఱచుటే మేలు

(॥వద్దు॥)
తనిసియునుఁ దనివోనిరతులకంటేను
కనుఁగొనుచుఁ జెలఁగుసంగతులే మేలు
యెనలేని శ్రీవేంకటేశ యిన్నిటికంటే
నినుఁగలసియున్ననా నేరుపే మేలు

(||pallavi||)
vaddu nannum̐ jĕnagagura vādem̐ṭigi
saddivem̐ḍigi sŏlabu jaṁkĕnalu melu

(||vaddu||)
vŏlasinŏllamula pŏṁ dŏnariṁchugaṁṭenu
alavogalainabŏlayalaga melu
kalasīgalayanimanasu kasigāḍugaṁṭenu
talabulo naḍiyāsadamagame melu

(||vaddu||)
pachchivĕchchulagūrmi pasariṁchugaṁṭenu
kŏchchi vūragayuṁḍuguṭṭu melu
vachchiyunu rāmulanu vaḍim̐bŏralugaṁṭenu
machcharamu māni mĕi maṟasuḍe melu

(||vaddu||)
tanisiyunum̐ danivoniradulagaṁṭenu
kanum̐gŏnusum̐ jĕlam̐gusaṁgadule melu
yĕnaleni śhrīveṁkaḍeśha yinniḍigaṁṭe
ninum̐galasiyunnanā nerube melu