వద్దివారి నెఱఁగదు వలపులు నీమీఁద
(॥పల్లవి॥)
వద్దివారి నెఱఁగదు వలపులు నీమీఁద
వుద్దండానకే చల్లే(ల్లీ) వుదుటుగా యిది
(॥వద్ది॥)
చూపులు నీపై వంచి సాయగపుటెలుఁగున
తీపులుగా మాఁటలాడీఁదిట్టఁగా ఇది
కోపగించుకో దెంతైనా కొసరి కొసరి నిన్ను
రాపుగా జోలిఁ బెట్టీని రవ్వగా ఇది
(॥వద్ది॥)
సెలవుల నిన్ను నవ్వి చేయి మాఁటుసేసుకొని
లలి నీకు నెత్తిం(త్తి)చ్చీ లండుగా ఇది
పిలువకే తా వచ్చి పిరుఁదులు నిన్ను నెంచి
చలివాసీ రతులకు జాణగా ఇది
(॥వద్ది॥)
గక్కనఁ బైఁ జేయివేసి కలసీ ని న్నింతలోనె
మొక్కుమొక్కి ఇచ్చలాడీ ముగ్ధగా యిది
యిక్కడను శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
పెక్కుసుద్దు లడిగీని పెద్దగా యిది
(||pallavi||)
vaddivāri nĕṟam̐gadu valabulu nīmīm̐da
vuddaṁḍānage salle(llī) vuduḍugā yidi
(||vaddi||)
sūbulu nībai vaṁchi sāyagabuḍĕlum̐guna
tībulugā mām̐ṭalāḍīm̐diṭṭam̐gā idi
kobagiṁchugo dĕṁtainā kŏsari kŏsari ninnu
rābugā jolim̐ bĕṭṭīni ravvagā idi
(||vaddi||)
sĕlavula ninnu navvi seyi mām̐ṭusesugŏni
lali nīgu nĕttiṁ(tti)schī laṁḍugā idi
piluvage tā vachchi pirum̐dulu ninnu nĕṁchi
salivāsī radulagu jāṇagā idi
(||vaddi||)
gakkanam̐ baim̐ jeyivesi kalasī ni nniṁtalonĕ
mŏkkumŏkki ichchalāḍī mugdhagā yidi
yikkaḍanu śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
pĕkkusuddu laḍigīni pĕddagā yidi