వద్దికి నేనిట్టే రావలె నంటాను
(॥పల్లవి॥)
వద్దికి నేనిట్టే రావలె నంటాను
కొద్దిమీర యెమ్మెలకే కొలవాయ నితఁడు
(॥వద్దికి॥)
వొల్లనే వాకిట నన్ను వొరసుకొంటాఁబోయి
యిల్లు చొచ్చి పవళించీ నెంతచనవే
పల్ల దాననాకప్రపుబరణి దీసి చెలుల
నెల్లాఁ బిలిచి పెట్టీ యెమ్మెలకే యితఁడు
(॥వద్దికి॥)
బెట్టి మాటలాడుమంటా పెంపుడు నా గోరవంకఁ
గొట్టఁ బోయీ బోఁదెకోలఁ గుచ్చితానను
అట్టె అదియునుఁ గాక ఆకు చుట్టి యిచ్చేచెలి
వొట్టు వెట్టి పిలిచీని పూరకే తా నితఁడు
(॥వద్దికి॥)
కాఁకలు నిలుపలేక కడపమీఁదికివచ్చి
చేఁకట లెస్సాయ నంటాఁజేయివట్టీని
సోఁకఁగ శ్రీవేంకటేశుఁ జూచి నే నే కలసితి
మాఁకుపడి కమ్మటిని మంచమెక్కీ నితఁడు
(||pallavi||)
vaddigi neniṭṭe rāvalĕ naṁṭānu
kŏddimīra yĕmmĕlage kŏlavāya nidam̐ḍu
(||vaddigi||)
vŏllane vāgiḍa nannu vŏrasugŏṁṭām̐boyi
yillu sŏchchi pavaḽiṁchī nĕṁtasanave
palla dānanāgaprabubaraṇi dīsi sĕlula
nĕllām̐ bilisi pĕṭṭī yĕmmĕlage yidam̐ḍu
(||vaddigi||)
bĕṭṭi māḍalāḍumaṁṭā pĕṁpuḍu nā goravaṁkam̐
gŏṭṭam̐ boyī bom̐dĕgolam̐ guchchidānanu
aṭṭĕ adiyunum̐ gāga āgu suṭṭi yichchesĕli
vŏṭṭu vĕṭṭi pilisīni pūrage tā nidam̐ḍu
(||vaddigi||)
kām̐kalu nilubalega kaḍabamīm̐digivachchi
sem̐kaḍa lĕssāya naṁṭām̐jeyivaṭṭīni
som̐kam̐ga śhrīveṁkaḍeśhum̐ jūsi ne ne kalasidi
mām̐kubaḍi kammaḍini maṁchamĕkkī nidam̐ḍu