వద్దే యింతేసి మాతో వట్టిసణఁగు
(॥పల్లవి॥)
వద్దే యింతేసి మాతో వట్టిసణఁగు
గద్దరివై యీపంతమే కడకూ నడపేవా
(॥॥)
కప్పుర మియ్యఁగఁబోతే కాఁతాళించి చూచేవు
వొప్పదా నీకిది నేఁడు వూరకే రాఁగా
కొప్పు గోరదువ్వితేనే గొణఁగేవు సారెసారె
అప్పుడే నే నంటితేనే ఆయములు దాఁకెనా
(॥॥)
పొంచి చేయివేసితేనే బొమ్మముడివెట్టేవు
నించి చన్నుఁగొండలానేనీ కిది వేఁగా
మంచముపైకిఁ దీసితే మరిఁ దలవంచేవు
యెంచఁగలపనులాయ నిఁకనేలే కొంకు
(॥॥)
అంది కాఁగిలించుకొంటే నసురుసు రయ్యేవు
కందువరతులు నేఁడే ఘనమాయనా
విందువలెఁ గూడితి శ్రీ వేంకటేశుఁడను నేను
ముందువెనక వాసింతే మొక్కలములేలే
(||pallavi||)
vadde yiṁtesi mādo vaṭṭisaṇam̐gu
gaddarivai yībaṁtame kaḍagū naḍabevā
(||||)
kappura miyyam̐gam̐bode kām̐tāḽiṁchi sūsevu
vŏppadā nīgidi nem̐ḍu vūrage rām̐gā
kŏppu goraduvvidene gŏṇam̐gevu sārĕsārĕ
appuḍe ne naṁṭidene āyamulu dām̐kĕnā
(||||)
pŏṁchi seyivesidene bŏmmamuḍivĕṭṭevu
niṁchi sannum̐gŏṁḍalānenī kidi vem̐gā
maṁchamubaigim̐ dīside marim̐ dalavaṁchevu
yĕṁcham̐galabanulāya nim̐kanele kŏṁku
(||||)
aṁdi kām̐giliṁchugŏṁṭe nasurusu rayyevu
kaṁduvaradulu nem̐ḍe ghanamāyanā
viṁduvalĕm̐ gūḍidi śhrī veṁkaḍeśhum̐ḍanu nenu
muṁduvĕnaga vāsiṁte mŏkkalamulele