Vadde salamu vinnavaari kemta (?)

వద్దె చలము విన్నవారి కెంత (?)
Language

(॥పల్లవి॥)
వద్దె చలము విన్నవారి కెంత (?)
కొద్దిమాలినట్టి నీ కోపమెంత

(॥వద్దె॥)
చెక్కునొక్కి తఁడు నీ చెయి వట్టినది యెంత
తెక్కుల నీ వాతనిఁ దిట్టేదెంత
ఇక్కువలంటి యాతఁడు ఇచ్చకమాడేదెంత
వెక్కసాన నీవందుకు విసిగేదెంత

(॥వద్దె॥)
కొంగువట్టెతఁడు నిన్నుఁ గూరిమి గొసరుటెంత
బెంగవలెనే వొట్లు వెట్టేదెంత
సంగతినాతఁడు నీతో చనవు మెరసేదెంత
వెంగలితనాన నీవు వీడనాడేదెంత

(॥వద్దె॥)
కాఁగిలించెతఁడు నీకుఁ గప్పుర మిచ్చేదెంత
మాఁగుచు నీపట్టే యనుమానించేదెంత
వీఁగక శ్రీవేంకటాద్రివిభుఁడు ని న్నిట్టె కూడె
నాఁగువార నీ వప్పటి నవ్వేదెంత

(||pallavi||)
vaddĕ salamu vinnavāri kĕṁta (?)
kŏddimālinaṭṭi nī kobamĕṁta

(||vaddĕ||)
sĕkkunŏkki tam̐ḍu nī sĕyi vaṭṭinadi yĕṁta
tĕkkula nī vādanim̐ diṭṭedĕṁta
ikkuvalaṁṭi yādam̐ḍu ichchagamāḍedĕṁta
vĕkkasāna nīvaṁdugu visigedĕṁta

(||vaddĕ||)
kŏṁguvaṭṭĕdam̐ḍu ninnum̐ gūrimi gŏsaruḍĕṁta
bĕṁgavalĕne vŏṭlu vĕṭṭedĕṁta
saṁgadinādam̐ḍu nīdo sanavu mĕrasedĕṁta
vĕṁgalidanāna nīvu vīḍanāḍedĕṁta

(||vaddĕ||)
kām̐giliṁchĕdam̐ḍu nīgum̐ gappura michchedĕṁta
mām̐gusu nībaṭṭe yanumāniṁchedĕṁta
vīm̐gaga śhrīveṁkaḍādrivibhum̐ḍu ni nniṭṭĕ kūḍĕ
nām̐guvāra nī vappaḍi navvedĕṁta