Vadde maamaada vina vachchevo raavo

వద్దే మామాట విన వచ్చేవో రావో
Language

(॥పల్లవి॥)
వద్దే మామాట విన వచ్చేవో రావో
యిద్దరి మీ పొందులకు నింత చెల్లునా

(॥॥)
పట్టినదే వ్రతమా పడఁతి నీ వతనితో
వొట్టువెట్టుకొంటివట వొక్కటి గాదు
వట్టినేరా లెవ్వరికి వచ్చుఁ బోవు నొకవేళ
యిట్టె పాయపువారి కంత చెల్లునా

(॥॥)
అత్తి సేసినదే చేఁతా అంగన నిన్ను నతఁడు
పొత్తుకు రమ్మనఁగాను పో ననేవు
వొత్తి విన్నవించనేల వోడలు బండ్ల వచ్చు
యెత్తయినదొరలకు నింత చెల్లునా

(॥॥)
ఆడినదే మాటా అదె శ్రీ వేంకటపతి
కూడే నే ననఁగాను గొణఁగేవు
యీడుజోడై యింతలోనే యిద్దరూ నొకటైతిరి
యేడనైనా నీదేకాక యంత చెల్లునా

(||pallavi||)
vadde māmāḍa vina vachchevo rāvo
yiddari mī pŏṁdulagu niṁta sĕllunā

(||||)
paṭṭinade vradamā paḍam̐ti nī vadanido
vŏṭṭuvĕṭṭugŏṁṭivaḍa vŏkkaḍi gādu
vaṭṭinerā lĕvvarigi vachchum̐ bovu nŏgaveḽa
yiṭṭĕ pāyabuvāri kaṁta sĕllunā

(||||)
atti sesinade sem̐tā aṁgana ninnu nadam̐ḍu
pŏttugu rammanam̐gānu po nanevu
vŏtti vinnaviṁchanela voḍalu baṁḍla vachchu
yĕttayinadŏralagu niṁta sĕllunā

(||||)
āḍinade māḍā adĕ śhrī veṁkaḍabadi
kūḍe ne nanam̐gānu gŏṇam̐gevu
yīḍujoḍai yiṁtalone yiddarū nŏgaḍaidiri
yeḍanainā nīdegāga yaṁta sĕllunā