వద్దన్నా మానదు చెలి వలపులు తోడంటి
(॥పల్లవి॥)
వద్దన్నా మానదు చెలి వలపులు తోడంటి
పొద్దున నాపెకు నీకు బుద్ది చెప్పరాదా
(॥వద్ద॥)
నీతోడి(డ) మాటలు నే నెయ్యముతో నాడఁగాను
ఆతలఁ దా నేలాడీ నండ(నడ్డ) మాఁటలు
చేతులు చాఁచి నిన్ను చెక్కులిట్టె నొక్కఁగాను
ఘాతల తన గోరేల కడలు దాఁకించీని
(॥వద్ద॥)
సమ్మతించి నీమోము సారె నేనుఁ జూడఁగాను
దొమ్మిఁ దా నప్పటినేల తోఁగి చూచీని
చిమ్ముల సరసములు చేరి నేనూ నాడఁగాను
వుమ్ముడిఁ జెనకీ నేల వూరకైనా దాను
(॥వద్ద॥)
కందువ నేను నీవు గాఁగిలించు కొనఁగాను
సందడిఁ గాలేల తొక్కీ జవళి నుండి
ఇందులో శ్రీ వేంకటేశ ఇద్దరముఁ గూడితిమి
నింద నీపైనేలవేసీ నిచ్చనిచ్చానవ్వి
(||pallavi||)
vaddannā mānadu sĕli valabulu toḍaṁṭi
pŏdduna nābĕgu nīgu buddi sĕpparādā
(||vadda||)
nīdoḍi(ḍa) māḍalu ne nĕyyamudo nāḍam̐gānu
ādalam̐ dā nelāḍī naṁḍa(naḍḍa) mām̐ṭalu
sedulu sām̐si ninnu sĕkkuliṭṭĕ nŏkkam̐gānu
ghādala tana gorela kaḍalu dām̐kiṁchīni
(||vadda||)
sammadiṁchi nīmomu sārĕ nenum̐ jūḍam̐gānu
dŏmmim̐ dā nappaḍinela tom̐gi sūsīni
simmula sarasamulu seri nenū nāḍam̐gānu
vummuḍim̐ jĕnagī nela vūragainā dānu
(||vadda||)
kaṁduva nenu nīvu gām̐giliṁchu kŏnam̐gānu
saṁdaḍim̐ gālela tŏkkī javaḽi nuṁḍi
iṁdulo śhrī veṁkaḍeśha iddaramum̐ gūḍidimi
niṁda nībainelavesī nichchanichchānavvi