వద్దన్న వారెవ్వరు ఆ వక్కణలేల చెప్పేవు
(॥పల్లవి॥)
వద్దన్న వారెవ్వరు ఆ వక్కణలేల చెప్పేవు
బద్దుల మీ సుద్దులకు బాఁతే నేను
(॥వద్ద॥)
మొగము చూచి యాపె మొక్కినయప్పటిమొక్కు
తగులుగా మూలఁబెట్టి దాఁచుకో నీవు
తెగరాకుంటే నీవే దేవరపై యందుకుఁగా
వగదీర నాచెలికి వరమిమ్మా యిపుడు
(॥వద్ద॥)
నిలుచుండి కొలిచిన నిలువుఁ గొలువు లెల్లా
వలసుగా కవిలేల వాయించు నీవు
అలరి యప్పటి నీవే ఆపెపాలిటిరాజవై
మలసి మలసి మెచ్చి మన్నించు మిపుడు
(॥వద్ద॥)
యీవల నన్నుఁ గూడితి వీపె సేసిన సేవలు
పోవులుగాఁగొన్ని కూడపోసుకో నీవు
శ్రీ వేంకటేశ యింకా నాచెలికి విటుఁడవై
సావధానమున సరసములాడు మిపుడు
(||pallavi||)
vaddanna vārĕvvaru ā vakkaṇalela sĕppevu
baddula mī suddulagu bām̐te nenu
(||vadda||)
mŏgamu sūsi yābĕ mŏkkinayappaḍimŏkku
tagulugā mūlam̐bĕṭṭi dām̐sugo nīvu
tĕgarāguṁṭe nīve devarabai yaṁdugum̐gā
vagadīra nāsĕligi varamimmā yibuḍu
(||vadda||)
nilusuṁḍi kŏlisina niluvum̐ gŏluvu lĕllā
valasugā kavilela vāyiṁchu nīvu
alari yappaḍi nīve ābĕbāliḍirājavai
malasi malasi mĕchchi manniṁchu mibuḍu
(||vadda||)
yīvala nannum̐ gūḍidi vībĕ sesina sevalu
povulugām̐gŏnni kūḍabosugo nīvu
śhrī veṁkaḍeśha yiṁkā nāsĕligi viḍum̐ḍavai
sāvadhānamuna sarasamulāḍu mibuḍu