Vaddanna maanavaidi vaani nitte senagidi

వద్దన్న మానవైతి వాని నిట్టె చెనకితి
Language

(॥పల్లవి॥)
వద్దన్న మానవైతి వాని నిట్టె చెనకితి
చద్దిజగడాలు నేఁడు సరివచ్చె గా

(॥వద్దన్న॥)
అప్పుడే నే నంటిఁగా ఆతని మన మేమన్న
చెప్పినవారినే తిట్టి చెనకీ నని
తప్పు తనవొళ్ళఁ గలా తగ దన్నవారి నెల్లా
దెప్పదాన నాయాలకుఁ దీసీనని

(॥వద్దన్న॥)
తారుకాణ వద్దంటిఁగా తానే వాఁడు కల్లకైనా
కోరి నాపై నాన వెట్టుకొనీ నని
దారి దప్పక వుండినా తనమాటె గెల్చుదాఁకా
పొరి పొరి యాడనైనా బొంకీ నని

(॥వద్దన్న॥)
కోపగించకు మంటిఁగా గుఱియై నిలిచితేనే
చేపట్టి వాడఁ బలిమి సేసీ నని
యేపున శ్రీవేంకటేశుఁడెందుబో నిక కూడె
యేపొద్దూఁ బాయ మింక నిద్దరము నొక్కటే

(||pallavi||)
vaddanna mānavaidi vāni niṭṭĕ sĕnagidi
saddijagaḍālu nem̐ḍu sarivachchĕ gā

(||vaddanna||)
appuḍe ne naṁṭim̐gā ādani mana memanna
sĕppinavārine tiṭṭi sĕnagī nani
tappu tanavŏḽḽam̐ galā taga dannavāri nĕllā
dĕppadāna nāyālagum̐ dīsīnani

(||vaddanna||)
tārugāṇa vaddaṁṭim̐gā tāne vām̐ḍu kallagainā
kori nābai nāna vĕṭṭugŏnī nani
dāri dappaga vuṁḍinā tanamāḍĕ gĕlsudām̐kā
pŏri pŏri yāḍanainā bŏṁkī nani

(||vaddanna||)
kobagiṁchagu maṁṭim̐gā guṟiyai nilisidene
sebaṭṭi vāḍam̐ balimi sesī nani
yebuna śhrīveṁkaḍeśhum̐ḍĕṁdubo niga kūḍĕ
yebŏddūm̐ bāya miṁka niddaramu nŏkkaḍe