Vaddani maanubaramma valadaamka polamu

వద్దని మానుపరమ్మ వలదాఁక పొలము
Language

(॥పల్లవి॥)
వద్దని మానుపరమ్మ వలదాఁక పొలము
సుద్దులూ నానలు వాఁడి చూపేటివేళను

(॥వద్దని॥)
చింత లెక్కి చిగురులు చెలియ గోయఁ దొడఁగె
వింతగాఁ బతిఁ బాసినవిరహవేళ
మంతుకు వలపు వూసి మఱి నేరేడు లమ్మీని
సంతసపు టిసుకలో చద్దివేఁడిపండులు

(॥వద్దని॥)
రేఁగు లెక్కి పూఁప లెల్లా రెమ్మి మాఁగవేయ జొచ్చె
పాఁగినతమకములు పట్టఁగ లేక
ఱాఁగయై చెలులఁ గొట్టె రావికాయ లేరఁ జొచ్చె
తోఁగిన చెల్లుబడి నీతోడివారిలోనను

(॥వద్దని॥)
కొమ్మ యశోకము లెక్కి గుత్తులు గోయఁ దొడఁగె
కమ్మర శ్రీవేంకటేశుఁ గలసేవేళ
నెమ్మది నోరూరఁగ నిమ్మలు ముంగిట వేసె
యెమ్మెలఁ గూడిన రతి యేకాంతవేళను

(||pallavi||)
vaddani mānubaramma valadām̐ka pŏlamu
suddulū nānalu vām̐ḍi sūbeḍiveḽanu

(||vaddani||)
siṁta lĕkki sigurulu sĕliya goyam̐ dŏḍam̐gĕ
viṁtagām̐ badim̐ bāsinavirahaveḽa
maṁtugu valabu vūsi maṟi nereḍu lammīni
saṁtasabu ṭisugalo saddivem̐ḍibaṁḍulu

(||vaddani||)
rem̐gu lĕkki pūm̐pa lĕllā rĕmmi mām̐gaveya jŏchchĕ
pām̐ginadamagamulu paṭṭam̐ga lega
ṟām̐gayai sĕlulam̐ gŏṭṭĕ rāvigāya leram̐ jŏchchĕ
tom̐gina sĕllubaḍi nīdoḍivārilonanu

(||vaddani||)
kŏmma yaśhogamu lĕkki guttulu goyam̐ dŏḍam̐gĕ
kammara śhrīveṁkaḍeśhum̐ galaseveḽa
nĕmmadi norūram̐ga nimmalu muṁgiḍa vesĕ
yĕmmĕlam̐ gūḍina radi yegāṁtaveḽanu