వద్దనేనా నేఁ దన్ను వలపెంత చవియైనా
(॥పల్లవి॥)
వద్దనేనా నేఁ దన్ను వలపెంత చవియైనా
అద్దుకొని తనకును ఆపెకు నమరునే
(॥వద్ద॥)
మచ్చికకు వేళ గద్దా మాటలకుఁ గొన గద్దా
పెచ్చు వెరిగీఁ గాక ప్రియుఁడు నాతో
ఇచ్చకాలు నేసెనంటా నింతి నిట్టె మెచ్చితేనే
మెచ్చనీవే మాతోనేల మేకులు చెప్పీనే
(॥వద్ద॥)
ననుపులో వింత గద్దా నవ్వులకు మితి గద్దా
అనువులు చూచీఁగాక ఆతఁడు నాతో
పెనఁగి పిలిచీనంటా ప్రియురాలిమాట వింటే
విననీవే మాతోనేల వేడుక చెప్పీనే
(॥వద్ద॥)
కూటమిలో కొంకు గద్దా కోరికకు మేర గద్దా
యేఁటిదో కాక శ్రీవేంకటేశుఁడు నాతో
యీటువెట్టే నంటా నాకెయింపులకె ననుఁ గూడె
కూటమికి నన్నేల గొరబుసేసీనే
(||pallavi||)
vaddanenā nem̐ dannu valabĕṁta saviyainā
addugŏni tanagunu ābĕgu namarune
(||vadda||)
machchigagu veḽa gaddā māḍalagum̐ gŏna gaddā
pĕchchu vĕrigīm̐ gāga priyum̐ḍu nādo
ichchagālu nesĕnaṁṭā niṁti niṭṭĕ mĕchchidene
mĕchchanīve mādonela megulu sĕppīne
(||vadda||)
nanubulo viṁta gaddā navvulagu midi gaddā
anuvulu sūsīm̐gāga ādam̐ḍu nādo
pĕnam̐gi pilisīnaṁṭā priyurālimāḍa viṁṭe
vinanīve mādonela veḍuga sĕppīne
(||vadda||)
kūḍamilo kŏṁku gaddā korigagu mera gaddā
yem̐ṭido kāga śhrīveṁkaḍeśhum̐ḍu nādo
yīḍuvĕṭṭe naṁṭā nāgĕyiṁpulagĕ nanum̐ gūḍĕ
kūḍamigi nannela gŏrabusesīne