వద్దనేనా నే నిన్ను వలసీ(చీ?) నొల్లము వైతే
(॥పల్లవి॥)
వద్దనేనా నే నిన్ను వలసీ(చీ?) నొల్లము వైతే
పొద్దున నాపెకు నీవు బుద్ది చెప్పరాదా
(॥వద్ద॥)
అల్లంత నుండి సన్న లాపె నీకుఁ జేయఁగాను
చెల్లఁబో పరాకేల సేసుకొనేవు
యెల్ల వారు నెరిఁగిరి యిఁకనేల మరఁగులు
చెల్లుబడి నాకెమాగట చేకొనరాదా
(॥వద్ద॥)
కనియుఁ గాకకుండాఁ గానిక లాపె యంపఁగా
చెనకక కటకటా సిగ్గు వడేవు
వెనకటిపొందులంటా వేసరుకో నిపుడేల
మనసు వచ్చితేఁ గన మందలించ రాదా
(॥వద్ద॥)
చేరి చేరి యంతా చేతనాకె మొక్కఁగాను
సారేనయ్యా నీవేల చప్పఁజేసేవు
గౌరవించి నన్ను శ్రీవేంకటేశ కూడితివి
వూరకె నాకె నిఁక నుండమనరాదా
(||pallavi||)
vaddanenā ne ninnu valasī(sī?) nŏllamu vaide
pŏdduna nābĕgu nīvu buddi sĕpparādā
(||vadda||)
allaṁta nuṁḍi sanna lābĕ nīgum̐ jeyam̐gānu
sĕllam̐bo parāgela sesugŏnevu
yĕlla vāru nĕrim̐giri yim̐kanela maram̐gulu
sĕllubaḍi nāgĕmāgaḍa segŏnarādā
(||vadda||)
kaniyum̐ gāgaguṁḍām̐ gāniga lābĕ yaṁpam̐gā
sĕnagaka kaḍagaḍā siggu vaḍevu
vĕnagaḍibŏṁdulaṁṭā vesarugo nibuḍela
manasu vachchidem̐ gana maṁdaliṁcha rādā
(||vadda||)
seri seri yaṁtā sedanāgĕ mŏkkam̐gānu
sārenayyā nīvela sappam̐jesevu
gauraviṁchi nannu śhrīveṁkaḍeśha kūḍidivi
vūragĕ nāgĕ nim̐ka nuṁḍamanarādā