Vaddanemaa ninnunu vadi nemdu dirigina

వద్దనేమా నిన్నును వడి నెందు దిరిగిన
Language

(॥పల్లవి॥)
వద్దనేమా నిన్నును వడి నెందు దిరిగిన
పెద్దరికానకు నాఁడే పెండ్లాడితి చాలును

(॥వద్ద॥)
సేయవయ్య నీ వాపెచెప్పిన ట్టెల్లాను
యీ యెడఁ జూడజాలక యేమి సేసే మిఁక నిన్ను
మాయింట నుండేము నేము మాకేమి
పాయపుమామగఁడవై బదికితేఁ జాలును

(॥వద్ద॥)
సరసము లాడవయ్య సతితోనే యేపొద్దు
మరుఁడే యెరుఁగుఁ గాక మాకేమి
వెరపులు చెప్పి చెప్పి వేరె కట్టుకొనే దేమి
వరుసనా డైన నిందు వచ్చి తేనే చాలును

(॥వద్ద॥)
కాఁగిలించుకొనవయ్య కాంతపై బత్తి సేసుక
మాఁగ వలచి వుండేము మాకేమి
రేఁగి కూడితివి మమ్ము శ్రీ వేంకటేశుఁడ నీవు
లోఁగి యట్టె మాచేతికి లోనై తేఁ జాలును

(||pallavi||)
vaddanemā ninnunu vaḍi nĕṁdu dirigina
pĕddarigānagu nām̐ḍe pĕṁḍlāḍidi sālunu

(||vadda||)
seyavayya nī vābĕsĕppina ṭṭĕllānu
yī yĕḍam̐ jūḍajālaga yemi sese mim̐ka ninnu
māyiṁṭa nuṁḍemu nemu māgemi
pāyabumāmagam̐ḍavai badigidem̐ jālunu

(||vadda||)
sarasamu lāḍavayya sadidone yebŏddu
marum̐ḍe yĕrum̐gum̐ gāga māgemi
vĕrabulu sĕppi sĕppi verĕ kaṭṭugŏne demi
varusanā ḍaina niṁdu vachchi tene sālunu

(||vadda||)
kām̐giliṁchugŏnavayya kāṁtabai batti sesuga
mām̐ga valasi vuṁḍemu māgemi
rem̐gi kūḍidivi mammu śhrī veṁkaḍeśhum̐ḍa nīvu
lom̐gi yaṭṭĕ māsedigi lonai tem̐ jālunu