Vaddanemaa ninnu nemu vattigaja reedanela

వద్దనేమా నిన్ను నేము వట్టిగజ రీడనేల
Language

(॥పల్లవి॥)
వద్దనేమా నిన్ను నేము వట్టిగజ రీడనేల
తిద్దవదు నీగుణాలు తెలుసుకోరాదా

(॥వద్ద॥)
తెలువ కానుకంపగాఁ దెచ్చిన చెలుల మింతె
అఱిముఱి జాణతనా లాడనేఁటికి
తఱఁగు మొఱఁగులేల దవ్వుగా దాపెకు నీకు
పిఱిదియ్యకున్నదిదె పెనఁగఁగరాదా

(॥వద్ద॥)
చెలిమారు వూడిగాలు సేయఁగవచ్చితి మింతె
బలిమితో మాకొంగు పట్టనేఁటికి
కలగంప సటలేల కాచుకున్నదాకె నీకు
పలికి యాపె వొడఁబరచఁగరాదా

(॥వద్ద॥)
పడఁతివద్దికి నిన్ను బట్టి తీసితి నింతె
యెడచొచ్చి మమ్ము గూడ నింతయేఁటికి
కడఁగి శ్రీవేంకటేశ కలసితి వాకె నిట్టె
జడియకుండా మోవి లంచము లియ్యరాదా

(||pallavi||)
vaddanemā ninnu nemu vaṭṭigaja rīḍanela
tiddavadu nīguṇālu tĕlusugorādā

(||vadda||)
tĕluva kānugaṁpagām̐ dĕchchina sĕlula miṁtĕ
aṟimuṟi jāṇadanā lāḍanem̐ṭigi
taṟam̐gu mŏṟam̐gulela davvugā dābĕgu nīgu
piṟidiyyagunnadidĕ pĕnam̐gam̐garādā

(||vadda||)
sĕlimāru vūḍigālu seyam̐gavachchidi miṁtĕ
balimido māgŏṁgu paṭṭanem̐ṭigi
kalagaṁpa saḍalela kāsugunnadāgĕ nīgu
paligi yābĕ vŏḍam̐barasam̐garādā

(||vadda||)
paḍam̐tivaddigi ninnu baṭṭi tīsidi niṁtĕ
yĕḍasŏchchi mammu gūḍa niṁtayem̐ṭigi
kaḍam̐gi śhrīveṁkaḍeśha kalasidi vāgĕ niṭṭĕ
jaḍiyaguṁḍā movi laṁchamu liyyarādā