వద్దనేమా నేము వలసిన పనులకు
(॥పల్లవి॥)
వద్దనేమా నేము వలసిన పనులకు
యిద్దరు నేకమై మాకు యేల లోఁగేవే
(॥వద్ద॥)
ముచ్చట నేమడిగితే మొఱఁగు మాటలాడేవు
బచ్చించి యాల నేరెడుఁబండులమ్మేవే
యిచ్చకానకాతనితో యిన్నినియ్యకొని వచ్చి
తచ్చనకు మాముందర తగవులాడేవే
(॥వద్ద॥)
మొగము నేము చూచితే మోసులువార నవ్వేవు
తగు వసంతపు నీట దైలు వోసేవే
అగపడి నీ విభుని కంకెలెల్లాఁ జెప్పి వచ్చి
పగటుతో మాముందర బయలీఁదించెవే
(॥వద్ద॥)
అందాలు నేమెరిఁగితే ఆయములు దాఁచేవు
గొందినే చెరువుకు మూకుడు మూసేవే
విందువలెనట్టె శ్రీ వేంకటేశుఁగూడి వచ్చి
చెంది మాముందరనేల సిగ్గులు వడేవే
(||pallavi||)
vaddanemā nemu valasina panulagu
yiddaru negamai māgu yela lom̐geve
(||vadda||)
muchchaḍa nemaḍigide mŏṟam̐gu māḍalāḍevu
bachchiṁchi yāla nerĕḍum̐baṁḍulammeve
yichchagānagādanido yinniniyyagŏni vachchi
tachchanagu māmuṁdara tagavulāḍeve
(||vadda||)
mŏgamu nemu sūside mosuluvāra navvevu
tagu vasaṁtabu nīḍa dailu voseve
agabaḍi nī vibhuni kaṁkĕlĕllām̐ jĕppi vachchi
pagaḍudo māmuṁdara bayalīm̐diṁchĕve
(||vadda||)
aṁdālu nemĕrim̐gide āyamulu dām̐sevu
gŏṁdine sĕruvugu mūguḍu mūseve
viṁduvalĕnaṭṭĕ śhrī veṁkaḍeśhum̐gūḍi vachchi
sĕṁdi māmuṁdaranela siggulu vaḍeve