వద్దనేమా నేము నిన్ను వట్టిమాట లేలాడేవు
(॥పల్లవి॥)
వద్దనేమా నేము నిన్ను వట్టిమాట లేలాడేవు
పొద్దువొద్దు దప్పకుండా భోగించవమ్మా
(॥వద్ద॥)
నేరుతువు మాటలెల్ల నీకే వలవుమని
చేరి విన్నపాలెల్లఁ జేసుకొవమ్మా
సారమైనవీమోవిచవు లాతనికిఁ జూపి
బీరముతో మాఁట పట్టించుకోవమ్మా
(॥వద్ద॥)
కలికి వన్నిటా నీవు కైవశము చేసుకొని
పిలిచి పతికి విందువెట్టవమ్మా
పలువూడిగాలు సేసి బలిమిఁ జన్నుల నొత్తి
మలసి యీతని నిట్టె మరిగించుకోవమ్మా
(॥వద్ద॥)
జిగి నలమేల్‌మంగవు శ్రీవేంకటేశుఁ డాతఁడు
తగిలితివి కాఁగిట దాఁచుకోవమ్మా
నగుతా నీయప్పణను ననునేలె నీతఁడు
మిగులాఁ జనవులను మెఱయవమ్మా
(||pallavi||)
vaddanemā nemu ninnu vaṭṭimāḍa lelāḍevu
pŏdduvŏddu dappaguṁḍā bhogiṁchavammā
(||vadda||)
neruduvu māḍalĕlla nīge valavumani
seri vinnabālĕllam̐ jesugŏvammā
sāramainavīmovisavu lādanigim̐ jūbi
bīramudo mām̐ṭa paṭṭiṁchugovammā
(||vadda||)
kaligi vanniḍā nīvu kaivaśhamu sesugŏni
pilisi padigi viṁduvĕṭṭavammā
paluvūḍigālu sesi balimim̐ jannula nŏtti
malasi yīdani niṭṭĕ marigiṁchugovammā
(||vadda||)
jigi nalamelmaṁgavu śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍu
tagilidivi kām̐giḍa dām̐sugovammā
nagudā nīyappaṇanu nanunelĕ nīdam̐ḍu
migulām̐ janavulanu mĕṟayavammā