వద్దనేమా నేము మీరు వావిగూడితేఁ జాలు
(॥పల్లవి॥)
వద్దనేమా నేము మీరు వావిగూడితేఁ జాలు
వొద్దఁ బెట్టుకొనవయ్య వువిదను నీవు
(॥వద్ద॥)
సేసవెట్టేదానికి సిగ్గులు వీడుపడును
ఆసగలదానికి నలవిలేదు
వేసరనిదానికి వెస నలయిక లేదు
సేసుకొవయ్య పెండ్లి చెలియతోను
(॥వద్ద॥)
పంతమాడేదానిపయ్యద జారుతా నుండు
మంతనమాడేదానికి మై చెమరించు
చెంత నుండేదానికి చిగిరించు కోరిక
కాంతకు గట్టఁగదయ్య కంకణము నీవు
(॥వద్ద॥)
రతిసేసేదానికి రసము లొలుకు మోవి
అతిమోహపుదానికి నదరు సంది
యితవై శ్రీవేంకటేశ యిదె నన్నుఁగూడితివి
అతివా నీవును బువ్వా లారగించు మిపుడు
(||pallavi||)
vaddanemā nemu mīru vāvigūḍidem̐ jālu
vŏddam̐ bĕṭṭugŏnavayya vuvidanu nīvu
(||vadda||)
sesavĕṭṭedānigi siggulu vīḍubaḍunu
āsagaladānigi nalaviledu
vesaranidānigi vĕsa nalayiga ledu
sesugŏvayya pĕṁḍli sĕliyadonu
(||vadda||)
paṁtamāḍedānibayyada jārudā nuṁḍu
maṁtanamāḍedānigi mai sĕmariṁchu
sĕṁta nuṁḍedānigi sigiriṁchu koriga
kāṁtagu gaṭṭam̐gadayya kaṁkaṇamu nīvu
(||vadda||)
radisesedānigi rasamu lŏlugu movi
adimohabudānigi nadaru saṁdi
yidavai śhrīveṁkaḍeśha yidĕ nannum̐gūḍidivi
adivā nīvunu buvvā lāragiṁchu mibuḍu