Vaddanemaa mimmu nemu natti dooru maagela

వద్దనేమా మిమ్ము నేము నట్టి దూరు మాకేల
Language

(॥పల్లవి॥)
వద్దనేమా మిమ్ము నేము నట్టి దూరు మాకేల
పొద్దువొద్దు దప్పకుండా భోగించరాదా

(॥॥)
మరిగినచెలి నీపై మచ్చికలు చల్లఁగాను
తొరలింపుఁ దమకాన తోఁగి చూచేవు
ఇరవైనఅడియాస లింతగలవారు మీరు
గరిమలఁ జలివాయఁ గాఁగిలించరాదా

(॥॥)
పొంచిపొంచి యాపె నిన్ను పూవులను వేయఁగాను
చఁచలించి యట్టె నీవు సన్నసేసేవు
మంచితనముల నింతమరిగినవారు మీరు
కొంచక పీఁటమీఁదటఁ గూచుండరాదా

(॥॥)
వెనకనుండాపె నేఁడు విడెము నీకియ్యఁగాను
యెనసితివి శ్రీ వేంకటేశ ఆపెను
మనసార నలమేలుమంగను నన్నేలితివి
పెనఁగనేల ఇద్దరూఁ బెండ్లాడరాదా

(||pallavi||)
vaddanemā mimmu nemu naṭṭi dūru māgela
pŏdduvŏddu dappaguṁḍā bhogiṁcharādā

(||||)
mariginasĕli nībai machchigalu sallam̐gānu
tŏraliṁpum̐ damagāna tom̐gi sūsevu
iravainaaḍiyāsa liṁtagalavāru mīru
garimalam̐ jalivāyam̐ gām̐giliṁcharādā

(||||)
pŏṁchibŏṁchi yābĕ ninnu pūvulanu veyam̐gānu
sam̐saliṁchi yaṭṭĕ nīvu sannasesevu
maṁchidanamula niṁtamariginavāru mīru
kŏṁchaga pīm̐ṭamīm̐daḍam̐ gūsuṁḍarādā

(||||)
vĕnaganuṁḍābĕ nem̐ḍu viḍĕmu nīgiyyam̐gānu
yĕnasidivi śhrī veṁkaḍeśha ābĕnu
manasāra nalamelumaṁganu nannelidivi
pĕnam̐ganela iddarūm̐ bĕṁḍlāḍarādā