Vaddanemaa mammum daanu vaasi remsavaddugaaga

వద్దనేమా మమ్ముఁ దాను వాసి రేఁచవద్దుగాక
Language

(॥పల్లవి॥)
వద్దనేమా మమ్ముఁ దాను వాసి రేఁచవద్దుగాక
పొద్దొక వింతలుగాను భోగించనీవే

(॥వద్ద॥)
తరుణి యిందరిలోనా తనకు బాఁతై తేను
సిరులపీఁట వెట్టి పూజించనీవే
గరిమి నాపెమాటలు కడువేడుకైతేను
వొరసి యేపొద్దుఁ జెవులొగ్గి విననీవే

(॥వద్ద॥)
పడఁతికిఁ దానిచ్చినబాస మీరరాకుండితే
బడ బెట్టుక తిరిగి బదుకనీవే
అడరి యాపెపై బత్తి ఆఁపరాక వుండితేను
పుడమి నాపెగుణాలు పొగడనీవే

(॥వద్ద॥)
మదిరాక్షికాఁగిలి మరిగి తా నుండితేను
కొదలేనిరతులనుఁ గూడనీవే
ఇదె తాను శ్రీవేంకటేశుఁడు నన్నుఁ గలసె
వదల కీసుద్దు లాపెవద్దఁ జెప్పనీవే

(||pallavi||)
vaddanemā mammum̐ dānu vāsi rem̐savaddugāga
pŏddŏga viṁtalugānu bhogiṁchanīve

(||vadda||)
taruṇi yiṁdarilonā tanagu bām̐tai tenu
sirulabīm̐ṭa vĕṭṭi pūjiṁchanīve
garimi nābĕmāḍalu kaḍuveḍugaidenu
vŏrasi yebŏddum̐ jĕvulŏggi vinanīve

(||vadda||)
paḍam̐tigim̐ dānichchinabāsa mīrarāguṁḍide
baḍa bĕṭṭuga tirigi baduganīve
aḍari yābĕbai batti ām̐parāga vuṁḍidenu
puḍami nābĕguṇālu pŏgaḍanīve

(||vadda||)
madirākṣhigām̐gili marigi tā nuṁḍidenu
kŏdaleniradulanum̐ gūḍanīve
idĕ tānu śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ galasĕ
vadala kīsuddu lābĕvaddam̐ jĕppanīve