వద్దనకురే నన్నునేల వలలఁబెట్టీనే
(॥పల్లవి॥)
వద్దనకురే నన్నునేల వలలఁబెట్టీనే
పొద్దువొద్దునకు నెగపోసీనే రమణుఁడు
(॥వద్ద॥)
వూరకుండఁగానే వొకటొకటే తలఁపించి
ఆరీతిఁ గొసరి మాటలాడింపించీనే
మేరతోఁ దలవంచితే మిక్కిలి మాయలు సేసి
చేరి తానేమైనఁ జూపించీనే రమణుఁడు
(॥వద్ద॥)
మఱచి నిద్రించేవారిమర్మపుఁ గళలు రేఁచి
గిఱిగొన మేను పులకింపించీనే
గుఱిగా నేఁ బాడఁగాను కొనగోర గిలిగించి
నఱుజుగా సెలవుల నవ్వింపించీనే
(॥వద్ద॥)
అచ్చపుసాజాన నుంటే నండనే పానుపు చేరి
పచ్చిచేసి నన్ను సిగ్గుపరపించీనే
యిచ్చల శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడి
ముచ్చటాడి నాచేత మొక్కింపించు కొనీనే
(||pallavi||)
vaddanagure nannunela valalam̐bĕṭṭīne
pŏdduvŏddunagu nĕgabosīne ramaṇum̐ḍu
(||vadda||)
vūraguṁḍam̐gāne vŏgaḍŏgaḍe talam̐piṁchi
ārīdim̐ gŏsari māḍalāḍiṁpiṁchīne
meradom̐ dalavaṁchide mikkili māyalu sesi
seri tānemainam̐ jūbiṁchīne ramaṇum̐ḍu
(||vadda||)
maṟasi nidriṁchevārimarmabum̐ gaḽalu rem̐si
giṟigŏna menu pulagiṁpiṁchīne
guṟigā nem̐ bāḍam̐gānu kŏnagora giligiṁchi
naṟujugā sĕlavula navviṁpiṁchīne
(||vadda||)
achchabusājāna nuṁṭe naṁḍane pānubu seri
pachchisesi nannu siggubarabiṁchīne
yichchala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍi
muchchaḍāḍi nāseda mŏkkiṁpiṁchu kŏnīne